Begin typing your search above and press return to search.

కమలాన్ని నలిపేస్తున్న రాజుగారు

By:  Tupaki Desk   |   12 Sept 2018 10:54 PM IST
కమలాన్ని నలిపేస్తున్న రాజుగారు
X
ఆయన భారతీయ జనతా పార్టీకి శాసనసభలో నాయకుడు. ముక్కుసూటి మనిషి అని పేరున్న నాయకుడు. తాను ఏం చెప్పదలచుకున్నారో అది చెప్పేందుకు వెనకడుగు వేయరు. కేంద్ర ప్రభుత్వం గురించైనా - రాష్ట్ర ప్రభుత్వం గురించైనా విమర్సించాల్సి వస్తే వెనుకడుగే వేయరు. ఆయనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు. సాక్షాత్తు శాసనసభ సాక్షిగా విష్ణుకుమార్ రాజు సంచలన ప్రకటన చేసారు. దీంతో శాసనసభలోనే కాదు....భారతీయ జనతా పార్టీలో కూడా కుదుపు ప్రారంభమయ్యింది. ఇంతకీ ఆ ప్రకటన ఏమిటనుకుంటున్నారా అంత సంచలనం ఏమిటని ఆలోచిస్తున్నారా........నిజమే సంచలనమే ఇంతకీ అది ఏమిటంటే...... "నేను ఈ రోజు ఈ పార్టీలో ఉంటాను. రేపు ఏ పార్టీలో ఉంటానో తెలియదు. అసలు రాజకీయ పార్టీలలో ఉంటానో లేదో కూడా తెలియదు. అలాంటి నేను ఏం మాట్లాడినా వాస్తవాలే చెప్తాను. దీంట్లో ఎటువంటి దాపరికమూ లేదు." అని విష్ణుకుమార్ రాజు కుండ బద్దలు కొట్టారు... కాదు...కాదు....కాదు కమలాన్ని నలిపేసారు.

గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహనికి 2,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడాన్ని విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. నిజానికి ఆ విగ్రహానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 300 కోట్లా రూపాయలేనని ఆయన చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ - ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం తప్పని ఆయన అన్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వంటం లేదు అనడం కూడా తప్పేనని ఆయన విమర్శించారు. తప్పును తప్పుగా చెప్పడంలో తానెప్పుడూ వెనకడుగు వేయనని, తన స్వభావం అది కాదని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేసారు. గత కొంత కాలంగా విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ నుంచి వెలుపలకు వస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ వార్తాల నేపథ్యంలోనూ, తాజాగా విష్ణుకుమార్ రాజు చేసిన ప్రకటనలోనూ ఇంచుమించు ఒకే అర్దం ఉండడంతో విష్ణుకుమార్ రాజు కమలానికి గుడ్ ‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.