Begin typing your search above and press return to search.
బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన విష్ణు!
By: Tupaki Desk | 30 Sep 2018 5:15 AM GMT2014 ఎన్నికలకు ముందు వరకు బీజేపీ నేత విష్ణుకుమార్ అంటే పెద్దగా తెలిసింది లేదు. ఆ మాటకు వస్తే.. ఎమ్మెల్యేగా బరిలో నిలిచినప్పుడు కూడా ఆయన గురించి తెలిసింది తక్కువే. కానీ.. ఏపీలో గెలిచిన అతికొద్ది మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో విష్ణుకుమార్ రాజు ఒకరు. అయితే.. తన తీరుతో ఆయన స్వల్ప వ్యవధిలో తన మార్క్ ను వేయగలిగారు. ఏపీలోని ప్రతి ఒక్కరు రాజును గుర్తు పట్టేలా చేసుకోగలిగారు.
తన తీరుతో ఆయన ఏపీ ప్రజలపై రిజిస్టర్ అయ్యేలా చేశారు. దీనికి తోడు ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయన తన పాత్రను నిర్వహించిన వైనం.. బీజేపీ నలుగురు ఎమ్మెల్యేల్లో తనదైన శైలితో ప్రత్యేకంగా ఫోకస్ కావటంలో విష్ణుకుమార్ ముందు ఉంటారని చెప్పక తప్పదు.
మిత్రుడిగా ఉన్న వేళలోనూ అధికారపక్షంపై విమర్శలు చేయటమే కాదు.. మిత్ర బంధం ముక్కలైన తర్వాత అధికారపక్షంతో చనువుగా ఉండటం బీజేపీ ముఖ్యనేతలకు ఒక పట్టాన అర్థం కావటం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆయోమయానికి.. కొత్త కన్ఫ్యూజన్ కు గురయ్యేలా చేశారు. ఇవాళ బీజేపీలో ఉన్నాను.. రేపు అక్కడ ఉండొచ్చు.. ఉండకపోవచ్చన్న ఆయన మాటలు ఇప్పుడు ఏపీ బీజేపీలో కొత్త కలకలాన్ని రేపుతోంది.
రాష్ట్ర సమస్యల విషయంలో ఆయనది ప్రత్యేక వైఖరిగా చెప్పాలి. ఏ పార్టీలో ఉన్నామన్నది కాకుండా.. తనకు తోచినట్లుగా ఉండటం రాజును అర్థం చేసుకోవటంలో మహా ఇబ్బందికరంగా మారుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన తీరును జాగ్రత్తగా గమనిస్తున్న వారు.. రానున్న రోజుల్లో టీడీపీలో చేరే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
ప్రత్యేక హోదాను ఏపీకి ఇచ్చే విషయంలో మోడీ ఎంత మొండిగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివేళ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ అసెంబ్లీ తీర్మానం చేస్తే.. దాన్ని వ్యతిరేకించకుండా.. కామ్ గా ఉండటంపై కమలనాథులు సీరియస్ గా ఉన్నారు. అంతేకాదు.. ఈ అంశంపై రాజును బీజేపీ ముఖ్యనేతలు వివరణ అడిగినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ.. వెనక్కి తగ్గని విష్ణుకుమార్ రాజు.. తాను ఒక్కడిని అడ్డుకున్నంత మాత్రాన హోదా తీర్మానం ఆగదని.. అందుకే తానేమీ మాట్లాడలేదంటూ ఘాటు సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తమ ప్రశ్నతో ఆత్మరక్షణలో పడతారనుకున్న విష్ణుకుమార్ రాజు.. అందుకు భిన్నంగా బీజేపీ ముఖ్యనేతల నోటిని మూయించిన తీరుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. విష్ణు చెప్పిన సమాధానానికి బీజేపీ ముఖ్యనేతల నోట్లో నుంచి ఎలాంటి మాటలు రాలేదంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఎంతకూ కొరుకుడుపడని రీతిలో ఉన్న విష్ణుకుమార్ రాజు బీజేపీ నేతలకు ఒక పట్టాన అర్థం కానట్లుగా మారానని చెప్పటంలో ఎంతమాత్రం సందేహం అక్కర్లేదని చెప్పాలి.