Begin typing your search above and press return to search.
నేను మారలేదు.. మారడంలేదు... నమ్మండ్రా బాబూ... ?
By: Tupaki Desk | 2 Jan 2022 8:19 AM GMTమారడాలు లేవు, మార్పు అంతకంటే లేదు. ఇది సత్యం. ఇదే నిత్యం. ఇదే నిజం అంటూ గగ్గోలే పెడుతున్నాడు ఒకానొక కమలనాధుడు. ఆయన సీనియర్ బీజేపీ నేత. ఒకసారి ఎమ్మెల్యేగానే కాదు, అదే టెర్మ్ లో బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన నాయకుడు. విశాఖకు చెందిన విష్ణు కుమార్ రాజు అంటే ఆయనే మరి. చాన్స్ వస్తే మరోసారి ఎమ్మెల్యేగా నెగ్గేసి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఆరాటపడుతున్న రాజు గారి మీద ఎందుకో తెలియదు కానీ ఒక బ్యాడ్ ప్రాపగాండా స్టార్ట్ అయిపోయింది.
ఆయన చిత్తశుద్ధిని, లక్ష్య శుద్ధిని శంకించేలా ఆయన రాజకీయ దారిని చిందరవందర చేసేలా ఆ ప్రచారం ఉందిట. అందుకే అర్జంటుగా రాజా వారు మీడియా ముందుకు వచ్చేసి నేను పార్టీ మారడంలేదు నమ్మండ్రా బాబూ అంటూ మొర పెట్టుకుంటున్నారు. నా గొంతులో కాషాయం తప్ప పసుపు రసం ఒక్క పాలు కూడా లేదంటే నమ్మి తీరాల్సిందే అంటున్నారు.
నా టోన్ లో పలికేది పలికించేది కూడా బీజేపీ నినాదమే తప్ప సైకిల్ బెల్స్ మోత కానే కాదని ఒట్టేసుకున్నారు. నేను మాట్లాడితే టీడీపీ టోన్ తో అంటున్నారు. నేను వైసీపీని విమర్శిన్సే టీడీపీ తమ్ముడిని అంటున్నారు. మేము కూడా ప్రతిపక్షమే. మేము కూడా ప్రభుత్వ విధానాలను ధాటీగానే ప్రశ్నిస్తున్నాం. ఇంకా చెప్పాలీ అంటే టీడీపీ కంటే ఘాటుగా మాట్లాడుతున్నది నేనే అంటున్నారు రాజు గారు.
ఇక జగన్ మీద గట్టిగా తాను సౌండ్ చేశాకే టీడీపీ వారు కూడా మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకున్నారు. ఆ విధంగా చూస్తే బీజేపీ గొంతునే టీడీపీ వారు తమ గొంతుగా చేసుకుంటున్నారు. దీనిని ఎందుకు ప్రచారం చేయరు అంటూ లాజిక్ పాయింట్ ని రాజావారు తీస్తున్నారు. బీజేపీ బాటలో టీడీపీ నడుస్తోంది, కాబట్టి ఆ పార్టీ నుంచే ఎవరైనా తమ వైపు వస్తే రావచ్చేమో అంటూ జోకేశారు కూడా.
ఇవన్నీ పక్కన పెడితే రాజు గారు శీలం మీద ఎవరికి సందేహం వచ్చింది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. ఆయన ఆది నుంచి బీజేపీలో ఉన్న నేత కాదు అని కూడా అంటున్నారుట. 2014 ఎన్నికల వేళ ఒక కేంద్ర మాజీ మంత్రి సిఫార్సులో ఆయన రాత్రికి రాత్రి టికెట్ ని కంఫర్మ్ చేయించుకుని పొత్తులో భాగంగా విశాఖ నార్త్ సీట్లోకి వచ్చి వాలారని కూడా టాక్ అయితే ఉందని చెబుతున్నారు.
ఇక ఆయన అయిదేళ్ల బీజేపీ ఎమ్మెల్యే హయాంలో కూడా శాసనసభలో బయటా చంద్రబాబుని ఎక్కువ పొగడడానికే టైమ్ వెచ్చించారు అని కూడా ప్రచారంలో ఉందంటారు. ఇక చంద్రబాబును ఆనాటి అందాల నటుడు శోభన్ బాబుతో పోల్చి మరీ కితాబులు ఇచ్చిన ఘనత కూడా ఆయనదే అంటారు. ఇక 2019 ఎన్నికల ముందు కూడా ఆయన టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారని, అది వర్కౌట్ కాలేదని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి.
ఇక 2024 ఎన్నికల్లో పొత్తులు కుదరకపోతే మాత్రం రాజు గారు బీజేపీ నుంచి మరోసారి పోటీ చేస్తారా అన్న చర్చ కూడా ఉందిట. అంటే ఆయన టీడీపీ టికెట్ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తారని కూడా అంటున్న వారూ ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే రాజు గారు తాను అచ్చమైన బీజేపీ మనిషిని అని చెప్పడంతో తెలియకుండానే సందేహాలకు ఆయనే చాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన రాజకీయ వ్యవహరశైలి మీద సొంత పార్టీలోనే డౌట్లు ఉన్నాయా అంటే ఏమో అన్న సమాధానం వస్తోందిట.