Begin typing your search above and press return to search.

రానంటూనే బాబుకు విష్ణు వార్నింగ్‌

By:  Tupaki Desk   |   7 April 2018 10:06 AM GMT
రానంటూనే బాబుకు విష్ణు వార్నింగ్‌
X
మాట‌ల్లేవ్‌.. మాట్లాడుకోవ‌టాల్లేవ్‌..అన్న‌ట్లుగా ఉంది ఏపీ రాజ‌కీయ‌మంతా. స‌మ‌స్య ప‌రిష్కారం కంటే కూడా.. ప్ర‌చారం మీద‌నే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ప్ర‌తి విష‌యంలోనూ మైలేజీ మీద‌నే దృష్టి పెట్టే బాబు పుణ్య‌మా అని.. హోదా సాధ‌న వ్య‌వ‌హారం అంత‌కంత‌కూ వెన‌క్కి వెళుతున్న ప‌రిస్థితి.

ఉద్య‌మ పంథాలో సాగే వేళ‌.. అంద‌రిని క‌లుపుకుపోవ‌టం చాలా ముఖ్యం. ఆ సంద‌ర్భంగా ఒక అడుగు వెన‌క్కి వేసినా త‌ప్పు లేదు. ఈ సూక్ష్మాన్ని ప‌ట్టించుకోని చంద్ర‌బాబు.. తాను మాత్ర‌మే ఫోక‌స్ కావాల‌ని.. అవ‌స‌రం లేని విష‌యాల్లో హ‌డావుడి చేసేందుకు అఖిల‌పక్షాన్ని పిలుస్తున్నార‌న్న విమ‌ర్శ‌ను ఎదుర్కొంటున్నారు. హోదా సాధ‌న కోసం ప్ర‌ధాని వ‌ద్ద‌కు ఏపీ అఖిల‌ప‌క్షాన్ని ఏర్పాటు చేసి.. అంద‌రిని తీసుకెళ్లి ఉంటే బాగుండేది కానీ.. ఆ ప‌ని చేయ‌లేదు చంద్ర‌బాబు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఏపీ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఒక లేఖ‌ను రాశారు. శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగే అఖిల‌ప‌క్ష స‌మావేశానికి తాము హాజ‌రు కావ‌టం లేద‌ని తేల్చేశారు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే బాబు యూట‌ర్న్ తీసుకున్నార‌ని ఆరోపించిన ఆయ‌న‌.. అసెంబ్లీలో త‌మ పార్టీ నేత‌ల‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేదంటూ మండిప‌డ్డారు. హోదా అంశంపై అఖిల‌ప‌క్షానికి నో చెప్పేసిన విష్ణు త‌న లేఖ‌లో బాబుకు వార్నింగ్ ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప‌ట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై ప్ర‌భుత్వం రియాక్ట్ కావాల‌న్నారు. లేనిప‌క్షంలో సీబీఐ విచార‌ణ‌కు లేఖ రాసే అంశాన్ని ఆలోచిస్తామ‌ని చెబుతున్న విష్ణు.. ప‌ట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై ప్ర‌భుత్వం రియాక్ట్ కాని ప‌క్షంలో సీబీఐ విచార‌ణ‌కు లేఖ రాసే అంశాన్ని ఆలోచిస్తామ‌ని చెప్పేశారు. చూస్తుంటే.. బాబుకు కొత్త స‌మ‌స్య‌లు రానున్నాయ‌న్న విష‌యాన్ని విష్ణు త‌న లేఖ ద్వారా హింట్ ఇచ్చిన‌ట్లుగా అనిపించ‌ట్లేదు?