Begin typing your search above and press return to search.
కాబోయే సీఎం జగన్:విష్ణు కుమార్ రాజు
By: Tupaki Desk | 3 May 2018 8:32 AM GMTకొద్ది రోజుల నుంచి టీడీపీపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఏ, బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే ....టీడీపీపై నర్మగర్భంగా, పరోక్షంగా విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో కటీఫ్ అయిన తర్వాత టీడీపీ, ఏపీ సీఎం చంద్రబాబులపై ఆ విమర్శల స్పీడ్ ను పెంచారు. తాజాగా, మరోసారి చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2019 ఎన్నికల్లో వైసీపీదే గెలుపని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని విష్ణు కుమార్ రాజు జోస్యం చెప్పారు. మరోసారి చంద్రబాబుపై విష్ణు కుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఇప్పటికే చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, భవిష్యత్తులో పూర్తిగా పడిపోతుందని అన్నారు.ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు..... హైదరాబాదులో ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే విజయవాడకు హుటాహుటిన మకాం మార్చారని అన్నారు. మొన్నటివరకు బీజేపీని పొగిడిన నోటితోనే.....ఇపుడు విమర్శలు గుప్పిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. కర్ణాటకలోని తెలుగువారికి .....బీజేపీకి ఓటు వేయవద్దని పిలుపునిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆయన చుట్టాలకు చంద్రబాబు పిలుపునివ్వాలని చమత్కరించారు. ఆ పిలుపుతో కర్ణాటకలోని తెలుగువారు ఇబ్బందిపడే పరిస్థితి ఉందన్నారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ బండారాన్ని త్వరలోనే బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.