Begin typing your search above and press return to search.
ఇంత జీతం కూడా బీజేపీ ఎమ్మెల్యేకి సరిపోదంట
By: Tupaki Desk | 1 April 2016 4:35 PM GMTప్రజాసేవను లక్షలాది రూపాయిలు జీతాలు తెచ్చి ఇచ్చే కొలువుగా చూడటం కొత్త ట్రెండ్ అన్నట్లుగా ఉంది తాజాగా ఏపీ బీజేపీ శాసనసభాఫక్ష నేత వైఖరి చూస్తుంటే. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి.. రేపటి సంగతి ఏమిటో అర్థంకాక.. దిక్కుతోచని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే..అవేమీ పట్టని విష్ణుకుమార్ రాజుకు తాజాగా పెరిగిన ఎమ్మెల్యేల జీతాలు ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వకపోవటం గమనార్హం.
నిన్నమొన్నటి వరకూ ఉన్న జీతాలకు రెట్టింపు జీతాలు చేస్తూ తాజాగా ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్యేల జీతభత్యాలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ.. ఏపీ ఆర్థిక పరిస్థితితో చూసినప్పుడు ఈ మొత్తం భారీ అనే చెప్పక తప్పదు. ఒకపక్క ఎమ్మెల్యేల జీతాల పెంపు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుంటే.. తాజాగా పెరిగిన జీతాలు ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు విష్ణు.
మెజార్టీ ఎమ్మెల్యేల సంగతి పక్కనపెడితే.. నీతిగా.. నిజాయితీగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు తాజాగా ఇచ్చే జీతాలు ఏ మూలకు సరిపోవని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా పెంచిన జీతాల్ని మరోసారి పరిశీలించాలని కోరుతున్నారు. తమ జీతాలు పెంచాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేసే ముందు.. తమ అధినాయకుడు.. ప్రధాని పదవిలో ఉన్న మోడీ జీతం లెక్క ఒక్కసారి చూస్తే బాగుంటుందేమో..?