Begin typing your search above and press return to search.
జగన్ కేబినెట్ కు రాజుగారి కాంప్లిమెంట్ ఇదే
By: Tupaki Desk | 8 Jun 2019 10:03 AM GMTవైసీసీ అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. నిన్న సాయంత్రానికే తన కేబినెట్ మినిస్టర్స్ లిస్టును గవర్నర్ నరసింహన్ కు అందజేసిన జగన్.... నేటి ఉదయం గవర్నర్ తోనే వారితో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఓ వైపు జరుగుతుండగానే.. జగన్ కేబినెట్ కూర్పుపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇలాంటి ప్రశంసల్లో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, తాజా ఎన్నికల్లో విశాఖ ఉత్తర స్థానం నుంచి ఓటమిపాలైన విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. జగన్ కేబినెట్ కూర్పు అద్భుతమంటూ కీర్తించిన రాజు గారు... జగన్ కేబినెట్ చూస్తుంటే గర్వంగా ఉందని కూడా ఆసక్తికర కామెంట్ చేశారు. జగన్ కేబినెట్ కూర్పు చాలా బాగుందంటూ రాజుగారు ప్రశంసించారు. సామాజిక సమీకరణలో జగన్ అందరికీ న్యాయం చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కొత్త మంత్రి వర్గంతో జగన్ ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
ఐదుగురు డిప్యూటీ సీఎంల ఏర్పాటు వినూత్న నిర్ణయమని విష్ణుకుమార్ రాజు కొనియాడారు. ఏది జరిగినా... అది మంచి అయినా, చెడు అయినా తన మనసులోని మాటను ఏమాత్రం మొహమాటం లేకుండా బయటపెట్టేసే రాజుగారి నోట నుంచి జగన్ కేబినెట్ కు ప్రశంసలు రావడం ఆసక్తికరమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలో చంద్రబాబు కేబినెట్ మీద కూడా ఆసక్తికరంగానే స్పందించిన రాజు... బీజేపీతో టీడీపీ మైత్రి ముగిసిన తర్వాత తనదైన చెణుకులతో బాబు సర్కారును ఇబ్బంది పెట్టేశారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయిందని, విశాఖలో వెలుగుచూసిన భూకుంభకోణాలే ఇందుకు నిదర్శనమని చెప్పిన రాజు... ఇప్పుడు జగన్ కేబినెట్ పై ప్రశంసలు కురిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.