Begin typing your search above and press return to search.
మంత్రులకు మనశ్శాంతి లేదటగా... ?
By: Tupaki Desk | 2 Jan 2022 12:30 AM GMTమంత్రులు అంటేనే ఆ దర్జా వేరుగా ఉంటుంది. బుగ్గ కార్లతో జామ్ జామ్మంటూ హాయిగా తిరుగుతూ తమ అధికార విలాసాన్ని చాటుకుంటారు. మంత్రి అంటేనే ఆ లెవెల్ వేరు. కానీ వర్తమానంలో మంత్రులను చూస్తే అలాంటి హోదా వైభోగాలు నిజంగా అనుభవిస్తున్నారా అన్న డౌట్లు పుట్టక మానవు. మంత్రి అంటే కాంగ్రెస్ లోనే అని చెప్పాలి. ఒక్కో మంత్రి పవర్ ఫుల్. ఎవరికి వారే రాజులు.
ఇక ప్రాంతీయ పార్టీలలో తీసుకుంటే చంద్రబాబు హయాంలోనే మంత్రులకు అధికారాలు చాలా వరకూ తగ్గిపోయాయని చెబుతారు. ప్రతీదీ నేరుగా సీఎం పర్యవేక్షణతోనే నాడు కధ సాగేది. అలా మంత్రులు తరువాత సీటుకే పరిమితం అయ్యారు. కీలకమైన డెసిషన్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రే తీసుకోవడం కూడా నాడే స్టార్ట్ అయింది. ఇక టీయారెస్, వైసీపీ ఏలుబడిలో మంత్రులు ఇంకా తగ్గిపోయారు అన్న టాక్ ఉంది.
మరీ ముఖ్యంగా ఏపీలో బాగా దిగజారిన ఆర్ధిక పరిణామాలు కూడా ఎటూ కాకుండా ఉన్నాయి. దాంతో మంత్రులకు తాము సీట్లో కూర్చున్నామన్న సంతృప్తి మాత్రమే ఉంది. కరోనా వల్ల జనాలకు ముఖం చూపించక రెండేళ్ళు ఇట్టే గడచిపోయాయి. జగన్ అయితే సగం పాలన అయ్యాక మంత్రులను తొంబై శాతం తప్పిస్తామని అప్పట్లోనే చెప్పారు.
ఇపుడు ఆ సగం పాలన ముగిసింది. మరి జగన్ మనసులో ఏముందో తెలియక మంత్రులు అంతా అన్యమనస్కంగా ఉంటున్నారని ప్రచారం అయితే గట్టిగానే బయల్దేరింది. మంత్రులకు అయితే మనశ్శాంతి లేదని విపక్షాలు కూడా ఎకసెక్కమాడుతున్నాయి. ఈ విషయంలో వారు యమ టెన్షన్ లో ఉన్నారని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వారికి ప్రీతిపాత్రమైన పండుగ సంక్రాంతి. నిజానికి అది పెద్ద పండుగ. అలాంటి పండుగ వేళ హుషారుగా జరుపుకోవాలంటే మంత్రులకు మనసు రావడంలేదట. తామెపుడు మాజీలమవుతామో అని వారు కలవరపడుతున్నారు అంటున్నారు.
దీని మీద బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే సెటైర్లు వేస్తున్నారు. పాపం వైసీపీ మంత్రులు అంటున్నారు. జగన్ చెప్పిన పుణ్య కాలం గడచిపోయింది. మంత్రులకు తమ పదవులు ఉంటాయో ఊడతాయో తెలియడంలేదు, అందుకే వారు సైలెంట్ అయిపోతున్నారు అని సానుభూతి కూడా చూపారు. ఇక ఎమ్మెల్యేల సంగతి కూడా అలాగే ఉంది అంటూ రాజు గారు వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు.
వారికి సీఎం దర్శన భాగ్యం దొరకడంలేదు, నియోజకవర్గాలలో చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేవు అంటూ బాగానే విసుర్లు విసిరారు. మొత్తానికి మంత్రులకు మనశ్శాంతి లేదని విపక్షాలు అన్నది నిజమేనా అంటే చాలా మంది దూకుడు తగ్గించడం బట్టి అవును అనే అనుకోవాలి. జగనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తే తప్ప మంత్రుల గుండె దిటవు చేసుకోలేరు. మొత్తానికి ఈ సంక్రాంతి వరకైనా మంత్రులకు కాస్తా శాంతి ఉంటే పండుగ తృప్తిగా చేసుకుంటారా. చూడాలి.