Begin typing your search above and press return to search.
భూకుంభకోణం ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యే మద్దతు
By: Tupaki Desk | 23 July 2017 6:32 AM GMTఏపీలో కలకలం రేకెత్తిస్తున్న విశాఖ భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేకు బీజేపీ మద్దతిస్తోందా? అధికార తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పుట్టించేలా సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదైన ఉదంతంలో బీజేపీ శాసనసభాపక్ష నేత మునుపటి దూకుడుతో స్పందించకపోవడంలో మర్మం ఇదేనా? ఏపీలోని రాజకీయాల్లో వర్గాల్లో ఇప్పుడు ఈ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మిత్రపక్షమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ తప్పిదాల విషయంలో ఏమాత్రం మొహమాట పడకుండా విరుచుకుపడే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ రావు విషయంలో దానికి భిన్నంగా స్పందించారని అంటున్నారు.
అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ రావు ప్రభుత్వానికి చెందిన సుమారు 95.89 ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం ద్వారా టీడీపీ శాసనసభ్యుడు ఈ భూమిని సొంతం చేసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో...స్థానిక తహశీల్దార్ పిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై ఎఫ్ ఐఆర్ నమోదవడం, ఆయన అరెస్టవడం జరిగిపోయింది. దీనిపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ... ``దర్యాప్తు సందర్భంగా అవినీతి వెలికితీయడం, అరెస్టు చేయడమే అధికారం పోలీసులకు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ఎప్పుడో ఆ స్థలాలు కొనుగోలు చేశారు. తాజాగా జరుగుతున్న సిట్ విచారణ సందర్భంగా ఆయన అరెస్టు కావడం ఏంటి? `` అని ప్రశ్నించారు.