Begin typing your search above and press return to search.

కేసీఆర్‌పై విష్ణుకుమార్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   5 Jan 2023 7:53 AM GMT
కేసీఆర్‌పై విష్ణుకుమార్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
బీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఏపీ నేత విష్ణుకుమా ర్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను ప‌నిగ‌ట్టుకుని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌కు దూరం చేసేందు కు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. దీనిలో సీఎం జ‌గ‌న్ పాత్ర కూడా ఉంద‌ని.. ఇద్ద‌రూ క‌లిసి ప‌వ‌న్ ను రాజకీయంగా బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఏపీలో కాపుల‌ను విడ‌దీసేందుకే.. కేసీఆర్‌.. తోట చంద్ర‌శేఖ‌ర్‌కు ఏపీలో బీఆర్ ఎస్ ప‌గ్గాలు అప్ప‌గించార‌ని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అయితే.. ఇది సాగ‌ద‌ని అన్నారు.అస‌లు ఏపీకి శ‌త్రువు అంటూ.. ఎవ‌రై నా ఉంటే అది కేసీఆరేన‌ని వ్యాఖ్యానించారు.

ఉమ్మడి రాష్ట్రాన్ని విడ‌దీసింది ఆయ‌నేన‌ని చెప్పారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మయంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను ఏవిధంగా తిట్టి పోశారో ఎవ‌రూ మ‌రిచిపోలేద‌ని కూడా వ్యాఖ్యానించారు.

ఏపీలో జ‌గ‌న్‌తో క‌లిసి..కేసీఆర్ కాపుల‌పై కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని విష్ణు వ్యాఖ్యానించారు. పవన్‌ను కంట్రోల్ చేయడం జగన్ వల్లే కాదు కేసీఆర్ వల్ల ఇంకేమవుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి దుస్థితి వచ్చిందని.. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏపీపై విద్వేషం కక్కారని రాజు ఆరోపించారు.

బీజేపీ-ప‌వ‌న్ క‌ళ్యాణ్-టీడీపీ క‌లిసి పోటీ చేస్తార‌ని.. వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఈ అనుకూల వాతావ‌ర‌ణా న్ని చెడగొట్టేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

జాతీయ పార్టీగా ఎదగాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఏపీలో మాత్రం జగన్ పార్టీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ పవన్ అవకాశాలు పోగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్నది విష్ణు ఆరోప‌ణల ప్ర‌ధాన ఉద్దేశం. మ‌రి దీనిపై తెలంగాణ‌లో ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.