Begin typing your search above and press return to search.
విశ్వక్ సేన్ vs టీవీ9 యాంకర్: అసలేం జరిగింది..?
By: Tupaki Desk | 3 May 2022 9:30 AM GMTటాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ మరియు టీవీ9 యాంకర్ దేవి మధ్య లైవ్ డిబేట్ లో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. విశ్వక్ ను ఉద్దేశిస్తూ 'పాగల్ సేన్' 'డిప్రెస్డ్ మ్యాన్' అని యాంకర్ అనడంతో పాటుగా 'గెటవుట్' అంటూ గట్టిగా అరవడం.. విశ్వక్ సైతం F** పదాన్ని వాడుతూ కోపంగా బయటికి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా మే 6న థియేటర్లలోకి రానుంది. దీంతో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం విశ్వక్ ఓ యువకుడితో కలిసి నడిరోడ్డు మీద సూసైడ్ ప్రాంక్ వీడియో చేయడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఫ్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. నడిరోడ్డు మీద ఈ న్యూసెన్స్ ఏంటంటూ విశ్వక్ సేన్ ని నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేశాడంటూ.. అడ్వకేట్ అరుణ్ కుమార్ హీరో పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో దీనిపై చర్చించడానికి విశ్వక్ సేన్ తో పాటుగా మరొకరిని టీవీ9 న్యూస్ ఛానెల్ వారు డిబేట్ కు పిలిచారు. ఫ్రాంక్ వీడియోలో పెట్రోల్ ఉపయోగించారని ఆరోపించడంతో.. ఈ సందర్భంగా విశ్వక్ రెండు క్యాన్లు తీసుకొచ్చి అందులో ఉంది పెట్రోల్ కాదని.. రస్నా నీళ్లు అని తాగి చూపించారు.
అయితే చర్చ జరుగుతున్న క్రమంలో విశ్వక్ సేన్ ను అందరూ 'పాగల్ సేన్' అంటారంటూ.. అతన్ని 'డిప్రెస్డ్ పర్సన్' గా యాంకర్ దేవీ పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వక్ సేన్.. తనను పర్సనల్ గా కించ పరిచేలా మాట్లాడినందుకు తనకు పరువునష్టం దావా వేసే హక్కు ఉందని.. మాటలు అదుపులో పెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో విశ్వక్ సేన్ ను తన స్టూడియో నుంచి వెళ్లిపోవాలంటూ 'గెట్ అవుట్' అంటూ గట్టిగా అరిచింది దేవి. ఇంటర్వ్యూకి పిలిచి.. మీరే నన్ను మాటలు అంటూ విశ్వక్ బయటకు వస్తూ అభ్యంతరకరమైన 'ఎఫ్' పదాన్ని వాడాడు. దీంతో ఆవేశానికి లోనైన యాంకర్.. 'వెధవ.. నోరుమూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో' అంటూ అరవడం వీడియోలో కనిపించింది.
ఈ నేపథ్యంలో టీవీ9 స్టూడియోలో విశ్వక్ సేన్ పిచ్చి వేషాలు అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది. ఇందులో లైవ్ జరుగుతుండగా.. విశ్వక్ అటూ ఇటూ తిరగడం.. మీ బ్లెస్సింగ్ కోసం వచ్చానంటూ స్వీట్స్ తెచ్చి యాంకర్ దేవీ కు ఇవ్వడం.. మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఓట్లు వేశానని చెప్పడం కనిపించింది. అయితే డిబేట్ లో కూర్చోండి మాట్లాడదాం అని అంటున్నా విశ్వక్ వినలేదు.
టీవీ9 స్టూడియో నుంచి రంజిత్ అనే వ్యక్తి ఫోన్ చేసారని.. మీరు ముందుగా అతనితో మాట్లాడాలి కానీ.. సడన్ గా లైవ్ లోకి వచ్చి మాట్లాడుతా అంటే ఎలా కుదురుతుంది? అని దేవీ ప్రశ్నించారు. ఈ క్రమంలో విశ్వక్ స్టూడియో నుంచి బయటకు వస్తున్న వీడియోని కూడా టీవీ9 షేర్ చేసింది.
ఇందులో 'మీరు ఇక్కడికి వస్తున్నట్లు ఎవరికైనా ఇంఫార్మ్ చేసారా?' అని యాంకర్ అడగ్గా.. 'నా గురించి మాట్లాడన్నారు కదా.. నేను లేకుండా డిస్కషన్ ఏంటని స్టూడియోకి వచ్చినా' అని విశ్వక్ చెప్పడం కనిపించింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు అనే విషయంలో మీద పెద్ద చర్చ జరుగుతోంది.
విశ్వక్ సేన్ మీద వ్యక్తిగత స్థాయిలో దాడి చేస్తూ యాంకర్ వాడిన పాగల్ సేన్ - డిప్రెస్డ్ మ్యాన్ అనే కొన్ని పదాలను.. అలాగే స్టూడియోకి పిలిచి గెటౌట్ అనడాన్ని అందరూ తప్పుబట్టారు. అదే సమయంలో విశ్వక్ వాడిన F** పదం విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అంతేకాదు విశ్వక్ పై యాంకర్ దేవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని టెలికాస్ట్ చేయకుండా.. కేవలం అతను ఉపయోగించిన పదాన్ని హైలైట్ చేయడం పై టీవీ9 పై ట్రోల్స్ వస్తున్నాయి. జర్నలిజం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మీడియాలో అలాంటి పదాన్ని వాడటం పై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పారు.
దెబ్బ తగిలినపుడు అమ్మా అని అరుస్తాం కదా.. అదే తరహాలో తన నోటి నుంచి ఆ మాట వచ్చేసింది అన్నాడు విశ్వక్. 16 ఏళ్లు దాటిన యూత్ అంతా ఇప్పుడు ఆ పదం వాడటం కామన్ అయిపోయిందని.. తాను కూడా అలాగే పెద్దగా ఆలోచించకుండా ఆ మాట అనేశానని వివరణ ఇచ్చాడు. ఐతే మీడియాలో ఇలాంటి పదం వాడినందుకు తాను పశ్చాత్తాప పడుతున్నానని.. సారీ చెప్పాడు.
ఆల్రెడీ దీనిపై ఒక నోట్ ప్రిపేర్ చేశానని.. దాన్ని రేపు పోస్ట్ చేస్తానని అన్నారు. అయితే ఆ పదం వాడటం తప్పితే.. మిగతా ఏ విషయంలోనూ తనకు పశ్చాత్తాపం లేదని.. తాను ఇంకే తప్పూ చేయలేదని విశ్వక్ పేర్కొన్నారు. ఇకపోతే తనను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు యాంకర్ దేవి పై పరువు నష్టం దావా వేయాలని విశ్వక్ సేన్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ టీమ్ ప్లాన్ చేసిన ఓ ఫ్రాంక్ వీడియో వల్ల ఇంత రచ్చ జరిగిందనేది స్పష్టం అవుతోంది. అయితే ఆ ఫ్రాంక్ వల్ల ఎంత న్యూసెన్స్ అయిందో తెలియదు కానీ.. ఇప్పుడు విశ్వక్ - టీవీ9 యాంకర్ మధ్య వాగ్వాదం జరగడం.. దాన్ని అదే పనిగా హైలైట్ చేయడంతో ఎక్కువ న్యూసెన్స్ జరుగుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.