Begin typing your search above and press return to search.
రేవంత్ సవాల్.. బెడిసికొట్టిందే..
By: Tupaki Desk | 18 Nov 2018 7:42 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి అన్నా.. కేసీఆర్ అన్నా ఒంటికాలిపై లేసే రేవంత్ రెడ్డి తొలిసారి దెబ్బైపోయాడా.? టీఆర్ ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని.. కేసీఆర్ కు దమ్ముంటే ఆపాలని రేవంత్ రెడ్డి విసిరిన బహిరంగ సవాల్ బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. నామినేషన్ల వేళ.. రేవంత్ విసిరిన ఈ సవాల్ తో మీడియా మొత్తం ఎవరా ఇద్దరు ఎంపీలు అని ఆరాతీశాయి. ఎన్నికల ముందట ఇది టీఆర్ ఎస్ కు పెద్ద దెబ్బే అని విశ్లేషణలు చేశారు. రేవంత్ అంత నమ్మకంతో చెప్పేసరికి అంతా నిజమని అనుకున్నారు.
కాగా రేవంత్ చెప్పిన ఆ ఇద్దరు ఎంపీలు వీరేనని మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీలు సీతారం నాయక్ - విశ్వర్వరరెడ్డిలు కాంగ్రెస్ లోకి చేరబోతున్నారని ప్రచారం జరిగింది. వీరు అసంతృప్తితోనే పార్టీ మారబోతున్నారని వార్తలొచ్చాయి..
మీడియాలో వార్తలు రావడంతో ఎంపీలు విశ్వశ్వరరెడ్డి - సీతారాం నాయక్ లు స్పందించారు. తాము టీఆర్ ఎస్ ను వీడమని.. రేవంత్ కావాలనే అబద్దపు ప్రచారం చేశాడని ధ్వజమెత్తారు. తమ పార్టీని దెబ్బతీయాలనే రేవంత్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఇలా సదురు ఎంపీలు గులాబీ పార్టీని వీడడం లేదని తేల్చేయడంతో అంతా రేవంత్ పై ఆడిపోసుకున్నారు. రేవంత్ కూడా అబద్దాలు ఆడేస్తున్నాడని తేటతెల్లమైంది. టీఆర్ ఎస్ కు జలక్ ఇద్దామని చేసిన ఈ పని రేవంత్ కే బూమరాంగ్ అయ్యింది.