Begin typing your search above and press return to search.
కాంగ్రెస్..ఆప్ సహా బాలీవుడ్ పైనా వివేక్ అగ్నిహోత్రి రివర్స్ పంచ్ !
By: Tupaki Desk | 4 Dec 2022 3:36 PM GMT`ది కాశ్మీర్ ఫైల్స్` రిలీజ్ అనంతరం రాజకీయంగా ఎలాంటి దుమారం రేపిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి సినిమా పై చర్చలు సాగుతూనే ఉన్నాయి. సినిమా థియేటర్లో రన్నింగ్ లో ఉన్నంత కాలం ఎలాంటి వివాదం లేదు. ప్రదర్శన ముగిసిన తర్వాత వివాదాలు ఒక్కక్కటిగా తెరపైకి రావడం మొదలైంది. ఆ మొదలు నేటి వరకూ కొనసాగుతూనే ఉంది.
ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ఇజ్రాయెల్ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ 'ది కాశ్మీర్ ఫైల్స్స సై వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రతిగా సదరు నిర్మాత క్షమాపణలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇలా కాశ్మీర్ ఫైల్స్ వివాదం ఏకంగా దేశాలే దాటిపోతుందని తెలుస్తోంది. ఈసినిమా భారీ విజయం సాధించడం సహా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురవడంతో దర్శక- నిర్మాత వివేక్అగ్నిహోత్రిని చాలా రకాలుగా టార్గెట్ చేసినట్లు కనిపించింది.
దీనిలో భాగంగానే ఇటీవలే వివేక్ అగ్నిహోత్రి తన `ది కాశ్మీర్ ఫైల్స్` విజయం తర్వాత ముంబైలో 17.9 కోట్ల ఖరీదు గల ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఖరీదైన ప్లాట్ వెనుక ఎంతో కథ ఉంది? అంటూ ఆయనపై పరోక్షంగా సెటైర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా వీటిపై వివేక్ తనదైన శైలిలోనే బధులిచ్చారు.
`రూమర్డ్ ఫాన్సీ అపార్ట్‌మెంట్ ఫోటోలతో కూడిన రిపోర్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ వివేక్ ఇలా ట్వీట్ చేసారు. `నా కోసం ప్రతిరోజూ కొత్త అపార్ట్‌మెంట్‌లను నిర్మిస్తున్నందుకు మరియు వారికి విలాసవంతమైన ఫర్నిచర్‌ను సమకూర్చినందుకు కాంగ్రెస్‌లు... ఆప్‌లు మరియు నిరుద్యోగ బాలీవుడ్ లందరికీ నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.
10 జనపథ్ నుండి వచ్చిన సోఫా నాకు బాగా నచ్చింది అంటూ వ్యగ్యాస్ర్తం విసిరారు. ఇలాంటి విసుర్లు ఆయనకు కొత్తేం కాదు. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి వస్తోన్న విమర్శలపై ఆయన ఇలాగే స్పందిస్తున్నారు. ఎలాంటి విమర్శలొచ్చినా వివేక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎంతటి వారిపైనైనా తనదైన శైలిలో రివర్స్ పంచ్ తప్పని సరి అయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.