Begin typing your search above and press return to search.
కేటీఆర్ ఫెయిల్.. సీఎం అయితే ఖతమే
By: Tupaki Desk | 12 Jan 2020 10:36 AM GMTతెలంగాణలో అంతా యువరాజు కేటీఆర్ సీఎం ఎప్పుడు అవుతాడా అని ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రులంతా ఇప్పటికే ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరిన ఎంపీ వినోద్ హాట్ కామెంట్స్ చేశారు.
వివేక్ కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. పురపాలక సంఘాలన్నీ ఇంత భ్రష్టుపట్టిపోవడానికి ఆ శాఖ చూస్తున్న కేటీఆర్ వైఫల్యం బాగా ఉందని.. అలాంటి వ్యక్తిని సీఎం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన సీఎం అయితే రాష్ట్రం ఎంత వెనుకబడి పోతుందో ఊహించుకోవాలని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకే టీఆర్ ఎస్ ఎంపీ ఎన్నికల్లో 7 సీట్లను కోల్పోయిందని.. నాయకత్వ లక్షణాలు లేని కేటీఆర్ కు ఎలా సీఎం పోస్టు ఇస్తారని వివేక్ ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి తానే గద్దెనెక్కాడని.. ఇప్పుడు ఆయన కుమారుడిని సీఎం చేస్తారా అని ప్రశ్నించారు.
తెలంగాణలో అధికారం అడ్డంపెట్టుకొని టీఆర్ఎస్ అక్రమంగా సంపాదించిందని.. ఆ సొమ్మును మున్సిపల్ ఎన్నికల కోసం వాడడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని ఆరోపించారు.