Begin typing your search above and press return to search.
బీజేపీలో చేరిన వివేక్ దీ అదే మాట
By: Tupaki Desk | 9 Aug 2019 11:54 AM GMTకాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసిన వివేక్ ఎందులోనూ చేరకుండా సైలెంట్ గా ఉంటూ ఆచితూచి వ్యవహరించారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చినా స్పందించలేదు. తాజా బీజేపీలో చేరారు.
తెలంగాణలో 2024 లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. అందుకే తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడంతో పాటు ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులను చేర్చుకుంటోంది. పారిశ్రామిక వేత్త, సీనియర్ పొలిటీషియన్ కుటుంబానికి చెందిన వివేక్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి ప్లస్సే.
శుక్రవారం సాయంత్రం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో వివేక్ బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్, తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్‌లతో వివేక్ సమావేశమయ్యారు వివేక్. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో వివేక్ అమిత్ షాను కలిశారు. అపుడే వివేక్ చేరిక దాదాపు ఖరారైపోయింది. ఈరోజు లాంఛనంగా పూర్తయ్యింది. బీజేపీలో చేరిన అనంతరం వివేక్ కేసీఆర్ పై విమర్శలు చేశారు.
"కెసిఆర్ ఎన్నడూ తన హామీలను నిలబెట్టుకోరు. కనీసం గుర్తుపెట్టుకోరు. అతను నిరంతరం ప్రజలను మోసం చేస్తున్నాడు. తెలంగాణలో బీజేపీ మాత్రమే కేసీఆర్ కు ప్రత్యామ్నాయం. కెసిఆర్ నియంతృత్వం అదుపులోకి తేగలిగిన ఏకైక పార్టీ తెలంగాణలో బీజేపీ మాత్రమే అని వివేక్ అన్నారు.
ఇదిలా ఉంటే... గత వారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఇంతలో ఆయన బీజేపీలోకి చేరిపోయారు. నిన్న వీహెచ్ కూడా పార్టీ మారుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఆయన చూపు కూడా బీజేపీ వైపే ఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో ప్రముఖ నేతలందరూ బీజేపీలో చూపడటంతో కాంగ్రెస్ భవిష్యత్తు మసక బారుతోంది.