Begin typing your search above and press return to search.
కమల్ వ్యాఖ్యలకు రీల్ మోడీకి కోపమొచ్చింది!
By: Tupaki Desk | 14 May 2019 5:04 AM GMTఒక్క వ్యాఖ్యతో యావత్ దేశం చూపు తన వైపు పడేలా చేసుకున్న నటుడు కమ్ రాజకీయ నేతగా కమల్ హాసన్ గా చెప్పాలి. ఇటీవల కాలంలో ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యాఖ్య చేసినోళ్లు మరొకరు ఉండరన్న ఆగ్రహం పలువురి నోటి నుంచి బలంగా వినిపిస్తోంది. జాతిపిత గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను ప్రస్తావిస్తూ.. దేశంలో తొలి ఉగ్రవాది హిందువే అంటూ మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
కమల్ చేసిన వ్యాఖ్యలపై వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. కమల్ లాంటి వ్యక్తి ఇంత దారుణ వ్యాఖ్యలు ఎలా చేస్తారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కమల్ చేసిన వ్యాఖ్యపై బాలీవుడ్ నటుడు.. మోడీ బయోపిక్ లో ఆయన పాత్రను పోషించిన వివేక్ ఒబరాయ్ తాజాగా స్పందించారు. కమల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు.
దేశాన్ని విభజించే రీతిలో ఏ ఒక్కరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆయన.. ఒక ట్వీట్ చేశారు. కమల్ సార్ మీరు గొప్ప నటులు. కళకు ఎలా అయితే మతం ఉండదో.. ఉగ్రవాదానికి మతం ఉండదు. గాడ్సే ఉగ్రవాదని అంటున్న మీరు హిందూ అని నిర్ధిష్టంగా ఎందుకు చెప్పారు? అని ప్రశ్నించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో వారి ఓట్ల కోసం ఇలా వ్యాఖ్యానించారా? అంటూ కడిగేసే ట్వీట్ పెట్టారు.
దయచేసి దేశాన్ని విభజించేలా వ్యవహరించకండి.. మనమంతా ఒక్కటే అంటూ వివేక్ పేర్కొన్నారు. రాజకీయ లబ్థి కోసం..కావాలని ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారంతా సంకుచిత వ్యాఖ్యలు చేస్తారే కానీ విస్తృత ప్రయోజనాల్ని పట్టించుకోరన్న విషయం తాజాగా కమల్ వ్యాఖ్య స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.