Begin typing your search above and press return to search.

వివేక్ జోరు.. బాల్క సుమన్‌ లో కంగారు

By:  Tupaki Desk   |   31 Jan 2018 2:34 PM GMT
వివేక్ జోరు.. బాల్క సుమన్‌ లో కంగారు
X
తెలంగాణలో పెద్దపల్లి నియోజకవర్గంలో పాలక టీఆరెస్ లో రాజకీయం రసకందాయంగా మారింది. ఎంపీ బాల్కసుమ‌న్‌, మాజీ ఎంపీ వివేక్ మ‌ధ్య పైకి కనిపించని పోటీ - శత్రుత్వం ముదురుతుండడంతో పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎన్నిక‌ల‌కు ఏడాది టైమ్ మాత్రమే ఉండ‌డంతో ఇరు వర్గాలూ ఎవరికి వారు పట్టు బిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి పట్టున్న కుటుంబం కావడంతో వివేక్ మళ్లీ ఇక్కడ స్వింగ్‌ లోకి వస్తున్నారని.. దీంతో గత ఎన్నికల్లో ఏదో కేసీఆర్ వేవ్ కారణంగా ఇక్కడ సునాయాసంగా గెలవగలిగిన సుమన్ ఇప్పుడు రాజకీయంగా వివేక్ ను ఎదుర్కోలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

గ‌త ఎన్నిక‌ల్లో వివేక్ కాంగ్రెస్‌ నుంచి -సుమన్ టీఆర్ ఎస్ నుంచి పోటీ చేశారు. అయితే, ఆ తరువాత వివేక్ టీఆరెస్ లో చేరారు. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేత కావడంతో కేసీఆర్ వివేక్ కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు హోదా కల్పించారు. అయితే.. వివేక్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ పెద్దపల్లి నుంచి పోటీచేసే ఆలోచనలో ఉండడంతో ఆయన త‌రచూ ఇక్కడ పర్యటిస్తూ జనంలో తిరుగతున్నారు.

దీంతో సుమ‌న్ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు స‌డలకుండా చూసుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన వివేక్ ప్రయారిటీ తగ్గించేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవ‌ల రామ‌గుండం రైల్వే వంతెన ప్రారంభ‌మైంది. గ‌తంలో ఎంపీగా ఉన్న‌ప్పుడు వివేక్ ఈ ప్లైఓవ‌ర్ కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ - ఈ బ్రిడ్జి ప్రారంభోత్స‌వానికి ఇప్పుడు వివేక్‌ ను ఆహ్వానించ‌లేదు. టీఆర్ ఎస్ మంత్రులు -ఎమ్మెల్యేలు - ఎంపీ మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు.. ఇంతకుముందు సింగ‌రేణి ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ పార్టీ సమావేశాల్లో వివేక్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సుమన్. దీంతో ప్రస్తుతం పెద్దపల్లి టీఆరెస్ లో రెండు గ్రూపులూ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇది కేసీఆర్ కు తలనొప్పిగా మారడం ఖాయమని వినిపిస్తోంది.