Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై వాట్సాప్ కత్తి దూసిన వివేక్
By: Tupaki Desk | 8 April 2019 4:52 AM GMTపిల్లిని సైతం గదిలో వేసి చితక్కొడితే పులిలా మారుతుందంటారు. ఇప్పుడు తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న వెనుకబడి వర్గాలకు చెందిన నేత.. ఆచితూచి అన్నట్లే కానీ.. ఆవేశానికి.. ఆగ్రహానికి దూరంగా ఉన్నట్లుగా వ్యవహరించే గడ్డం వివేకానంద తొలిసారి టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నేరుగా కత్తి దూశారు.
రాజకీయాల్లో తీసుకునే ఒక్క తప్పటడుగుకు ఎంత భారీ మూల్యం చెల్లించాలన్న విషయానికి నిలువెత్తు నిదరశనంగా కనిపిస్తుంటారు వివేకా. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ ఎస్ గూటికి వెళ్లి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసిన తర్వాత.. సెంటిమెంట్ కాంగ్రెస్ పక్షాన ఉంటుందన్న ఆలోచనతో గులాబీ కారును వదిలేసి.. హస్తం గూటికి వచ్చేసిన ఆయన 2014 ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఆయన తప్పుల మీద తప్పులు చేశారు.
తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ తనను నమ్మి ఎంపీ టికెట్ ఇస్తారని భావించారు. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివేకా తీరుపై అనుమానం పెట్టుకున్న కేసీఆర్ తాజాగా ఆయనకు టికెట్ కేటాయించకుండా మరొకరికి ఇవ్వటాన్ని వివేకా తట్టుకోలేకపోయారు.
ఆర్థికంగా బలమైన నేతగా.. అంగబలానికి తక్కువ లేకపోవటమే కాదు.. బలమైన సొంత మీడియా సంస్థ ఉన్నప్పటికి తనను పట్టించుకోని కేసీఆర్ తీరుతో మనస్తాపానికి గురైన ఆయన.. తాజాగా గులాబీ బాస్ పై కత్తి దూసేందుకు సిద్ధమైనట్లుగా చెప్పాలి. కొమ్ములు తిరిగిన నేతలు.. వివిధ వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్ తో పెట్టుకోవటం ఎందుకు?.. అని రాజీ పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా వివేకా ఝుళిపిన ప్రచార కత్తి ఇప్పుడు సంచలనంగా మారింది.
పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ను ఓడించాలని.. ఆ పార్టీకి ఓటేయొద్దని వివేకా పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయనీ సందేశాన్ని సంధించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటుందన్న వివేకాను కలుస్తున్న వారికి.. కారుకు ఓటేయకుండా.. హస్తానికి ఓటు వేయాల్సిందిగా తన అనుచర వర్గానికి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా. వివేకా నుంచి వెలువడిన వాట్సాప్ సందేశం ఇప్పుడు వైరల్ గా మారింది.
‘ప్రియమైన కార్యకర్తలు, మిత్రులారా.. కేసీఆర్ నమ్మకద్రోహం చేసినందుకు టీఆర్ ఎస్ కు ఓటు వేయొద్దు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడి - పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. కానీ ఈ నియంతృత్వ పాలన భవిష్యత్తు తరాలకు మంచిది కాదు. బానిసత్వం దూరం కావాలంటే టీఆర్ ఎస్ ను ఓడించండి.’ మీ వివేక్ అంటూ పంపుతున్న సందేశానికి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల్ని వివేకా ఎంతమేర ప్రభావితం చేస్తారన్నది తుది ఫలితం వెలువడితే కానీ లెక్క తేలదు. అందుకు దాదాపు రెండు నెలలు వెయిట్ చేయక తప్పదు.