Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసు అవినాష్ టు జగన్!

By:  Tupaki Desk   |   1 March 2022 6:42 AM GMT
వివేకా హత్య కేసు అవినాష్ టు జగన్!
X
వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా తన రూటును మార్చుకున్నాయి. వివేకా హత్య కేసులో ఇంతకాలం కడప ఎంపీ అవినాష్ రెడ్డిపైన మాత్రమే ఆరోపణలు చేసిన వాళ్ళు తాజగా డైరెక్టుగా జగన్ పైనే మొదలుపెట్టారు.

వివేకా హత్య కేసులే జగనే అసలైన దోషంటు చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. మొన్నటివరకు హత్య కేసులో నిందితులను జగన్ కాపాడుతున్నట్లు ఆరోపణలు చేసిన వాళ్ళే తాజాగా హత్య చేయించిందే జగన్ అని బురదచల్లేస్తున్నారు.

వివేకా హత్యకు అసలు పథకం రచించిందే జగన్ అనే అనుమానాన్ని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, కూతురు సునీత ఆరోపించారు. వీళ్ళకన్నా చంద్రబాబు ఒకడుగు ముందుకేసి హత్యలో అసలు దోషి జగనే అంటు చంద్రబాబు పదే పదే చెప్పారు. హత్య కేసులో జగన్ దోషి అనటానికి చంద్రబాబు దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా అంటే ఏమీలేదు. బట్టకాల్చి మీద వేసేయటమే చంద్రబాబు నైజం. తాను ఏమి చెప్పినా రాసే మీడియా ఉంది కాబట్టి చెల్లుబాటయిపోతోంది.

నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ జగన్నే దోషిగా చూపిస్తున్నట్లు చంద్రబాబు ఫైనల్ చేసేయటమే విచిత్రంగా ఉంది. నిందుతుల్లో ఎవరు కూడా హత్య చేయించింది జగనే అని చెప్పలేదు. నిందితుల్లో ఎవరు కూడా హత్య చేయించింది కడప ఎంపీ అవినాష్ రెడ్డే అని కూడా చెప్పలేదు. కాకపోతే హత్యలో పాల్గొన్నవారిలో దేవిరెడ్డి శవశంకరరెడ్డి ఎంపీకి బాగా సన్నిహితుడు అన్న కారణంతో ఎంపీ పాత్రపైన ఆరోపణలున్నాయి.

సీబీఐకి వాంగ్మూలాలు ఇచ్చిన వారిలో కల్లూరు గంగాధరరెడ్డి జగన్ వ్యతిరేక మీడియాపై మండిపోతున్నారు. తాను సీబీఐకి చెప్పని విషయాలను కూడా తాను చెప్పినట్లు, తన వాంగ్మూలంగా వార్తలు రాయటంపై కోర్టులో కేసు వేస్తానని వార్నింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

మొత్తంమీద వివేకా హత్య కేసును సీబీఐని స్వేచ్చగా, సమర్ధవంతంగా దర్యాప్తు చేయనీయకుండా అనేక కోణాల్లో అటు ఇటు లాగేస్తున్నది వాస్తవం. హత్య కేసులో నిజంగానే పాత్రుంటే అవినాష్ అయినా, జగన్ అయినా ఎవరూ తప్పించుకోలేరన్నది వాస్తవం.