Begin typing your search above and press return to search.

సీబీఐ దూకుడు: వివేకా హత్యకు వాడిన ఆయుధాల గుర్తింపు?

By:  Tupaki Desk   |   7 Aug 2021 2:30 PM GMT
సీబీఐ దూకుడు: వివేకా హత్యకు వాడిన ఆయుధాల గుర్తింపు?
X
ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక ముందుడుగు వేసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించింది. కస్టడీ విచారణలో సునీల్ చెప్పిన వివరాల ఆధారంగా వివేకా హత్యకు వాడిన ఆయుధాలను సీబీఐ గుర్తించింది.

పులివెందులలోని రోటరీపురం వాగులోని ఇసుకలో వివేకా హత్యకు వాడిన ఆయుధాలు దాచిపెట్టినట్లు గుర్తించిన అధికారులు వాటిని వెలికి తీసే పనిలో ప్రస్తుతం ఉన్నారు.

రెండు నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు తాజాగా ఈ హత్యకు ప్రధాన సూత్రధారి సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. సునీల్ ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ సమాచారంతో వివేకా హత్య కేసు కొలిక్కి వస్తోందని సీబీఐ భావిస్తోంది.

వైఎస్ వివేకా హత్య వెనుక ఎవరెవరున్నారు. వాడిన ఆయుధాలేంటి? ఇలా పలు అంశాలపై సునీల్ యాదవ్ ను సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ను పులివెందులలోని పలు చోట్లకు తిప్పుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును మలుపుతిప్పే ఆధారలు దొరికినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం వివేకా హత్యకు వాడిన ఆయుధాలను తెలుసుకున్న అధికారులు వాటిని ఎక్కడ దాచారో కూడా వివరాలు తెలుసుకున్నారు. స్తానిక రోటరీనగర్ లోని వాగు ఇసుక లో వివేకా హత్యకు వాడిన ఆయుధాలు దాచిపెట్టినట్లుగా తెలుసుకొని సీబీఐ అధికారులు వాటిని వెలికి తీస్తున్నారు. వాగులోని నీటిని బయటకు తోడేస్తున్నారు. వాటిని వెలికితీస్తే కేసులో గొప్ప పురోగతి సాధించినట్లు అవుతుందని సీబీఐ భావిస్తోంది.