Begin typing your search above and press return to search.

తాజా పరిణామాలపై వివేక కారు డ్రైవర్ దస్తగిరి ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   27 July 2021 4:35 AM GMT
తాజా పరిణామాలపై వివేక కారు డ్రైవర్ దస్తగిరి ఏం చెప్పారు?
X
అంతకంతకూ పీటముడులు పడుతున్న వైఎస్ వివేక హత్య ఉదంతంపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత చర్చ జరుగుతోంది. రాష్ట్ర సీఎం సొంత బాబాయ్ దారుణంగా హత్య జరిగిన ఉదంతంపై విచారణ ఇప్పటికి పూర్తి కాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కోర్టు ఎదుట వివేక ఇంటి వద్ద కాపలాదారుగా వ్యవహరించే రంగన్న హత్యకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

వివేక హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి.. దస్తగిరి.. సునీల్ ప్రమేయం ఉందని పేర్కొన్న నేపథ్యంలో.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేక కారు డ్రైవర్ దస్తగిరి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని వెల్లడించారు. హత్య అనంతరం.. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు చెప్పిన మీదట దాదాపు రెండు నెలల పాటు తాను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు.వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు త్వరలోనే పూర్తి అవుతుందన్న ఆశాభావాన్నివ్యక్తం చేశారు. అతగాడేం చెప్పాడన్నది చూస్తే..

- వైఎస్ వివేక ఇంటి వద్ద పని చేసే ప్రతి ఒక్కరు ఎర్రగంగిరెడ్డికి తెలుసు

- నన్ను పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు? అరెస్టు చేయకుండా ఆపాలని కోర్టును ఎందుకు ఆశ్రయించాలి?

- వివేకా వద్ద పంచాయితీలు చేయించుకునేందుకు సునీల్ కుమార్ యాదవ్ వచ్చేవారు. అలానే పరిచయమైంది

- హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి.. నేను.. సునీల్ ప్రమేయం ఉందని రంగన్న చెప్పిన మాటల్లో వాస్తవాలు తెలీవు

- రంగన్న అనవసరంగా పేర్లు చెప్పారు. ఎవరైనా ఒత్తిడి చూస్తే అలా చెప్పాడేమో? సీబీఐ అధికారులు తమ విచారణలో తేలుస్తారు

- సీబీఐ దర్యాప్తు కోసం రెండు నెలలు ఢిల్లీలోనే ఉన్నా.

- మాది లింగాల మండలం చింతలపల్లె. పాతికేళ్ల క్రితం పులివెందులకు వచ్చా. 2016 నుంచి 2019 వరకు వివేక వద్ద కారు డ్రైవర్ గా పని చేశా.

- సునీల్ తో పాటు నాపై కూడా సీబీఐ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు.