Begin typing your search above and press return to search.
సంచలనం: వివేకా హత్యపై సీబీఐకి ఏబీవీ లేఖ
By: Tupaki Desk | 16 April 2021 9:30 AM GMTఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సంచలన విషయాలను వెల్లడిస్తూ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా సీబీఐకి లేఖ రాశారు. ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ సంచలనం రేపుతోంది.
2019 మార్చి 15న పులివెందులలోని ఆయన స్వగృహంలో వివేకానందరెడ్డి మరణించారని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. గుండెపోటుతో బాత్ రూమ్ లో జారి పడిపోయారని ఆరోజు మధ్యాహ్నం వరకు మీడియాలో ప్రసారమైందని తెలిపారు.
వివేకా హత్య జరిగిన చాలా సేపటి వరకు ఎవరినీ లోపలికి అనుమతించలేదని.. పోలీసులను కొందరు ప్రజాప్రతినిధులు కావాలనే అడ్డుకున్నారని తెలిపారు.
ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత అది హత్య అని తేలిందన్నారు. వివేకా హత్య కేసును గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారని.. హత్య జరిగిన తర్వాత ఇల్లంతా కడిగేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే వరకు ఘటన స్థలంలో ఎంపీ అవినాష్ రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారని తెలిపారు.
ఆ సమయంలో మీడియాను, ఇంటెలిజెన్స్ సిబ్బందిని, పోలీసులను కూడా వివేకా హత్య జరిగిన ఇంట్లోకి అనుమతించలేదని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో వివరించారు.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎన్ఎం సింగ్ బృందం ఈ కేసు దర్యాప్తు చేస్తోందని.. తాను వివరాలు అందిస్తానన్న ఏ అధికారి పట్టించుకోకపోవడం తనకు ఆశ్చర్యానికి గురిచేస్తోందని తెలిపారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడాది గడిచినా పురోగతి లేదని వివరించారు.
వివేకా హత్య జరిగిన సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడని.. ఈ కారణంగానే నన్ను ఉద్దేశ పూర్వకంగా విధుల నుంచి తప్పించి ఉంటారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.