Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్.. వైజాగ్‌లు మొనగాళ్లు!

By:  Tupaki Desk   |   17 May 2017 6:53 PM GMT
సికింద్రాబాద్.. వైజాగ్‌లు మొనగాళ్లు!
X
దేశ వ్యాప్తంగా చేసిన సర్వే లో తెలుగు ప్రాంతానికి చెందిన రెండు కీల‌క రైల్వేస్టేష‌న్లు మొన‌గాడిగా అనిపించుకోవ‌ట‌మే కాదు.. దిబెస్ట్ అన్న జాబితాలో ఉండ‌టం తెలుగువారికి సంతోషాన్ని క‌లిగించేవ‌న‌టంలో సందేహం లేదు. తాజాగా విడుద‌ల చేసిన ఈ ఆస‌క్తిక‌ర ర్యాంకుల ముచ్చ‌ట‌లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేష‌న్లలో స్వ‌చ్ఛ‌తా ప్ర‌మాణాలు పాటిస్తున్న రైల్వేస్టేష‌న్ల‌కు ర్యాంకుల్ని తాజా ప్ర‌క‌టించారు. దేశ వ్యాప్తంగా 407 రైల్వే స్టేష‌న్ల‌లోని ఐఆర్‌సీటీసీ..క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేర్వేరుగా నిర్వ‌హించిన స‌ర్వే జ‌రిపి ర్యాంకుల్ని డిసైడ్ చేశారు. ఈ స‌ర్వేలో ఏపీకి చెందిన‌ విశాఖ‌ప‌ట్నం.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ స్టేష‌న్లు ఏ1 కేట‌గిరిలో నిలిచాయి. ఈ రెండు స్టేష‌న్ల‌తో పాటు జ‌మ్ముతావి స్టేష‌న్ కూడా ఏ1 కేట‌గిరిలో నిలిచింది.

ఇక ఏ కేట‌గిరి విష‌యానికి వ‌స్తే.. బియాస్‌.. ఖ‌మ్మం.. అహ్మ‌ద్ న‌గ‌ర్ రైల్వేస్టేష‌న్లు నిలిచాయి. ఇక‌.. జోన్ల వారీగా చూస్తే.. ఆగ్నేయ రైల్వేల‌కు తొలిస్థానంం ద‌క్క‌గా.. రెండో స్థానంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే.. మూడో స్థానంలో మ‌ధ్య రైల్వేలు నిలిచాయి. ప్ర‌స్తుతానికి స్వ‌చ్ఛ‌త‌కు ర్యాంకులు ఇచ్చిన‌ప్ప‌టికీ రానున్న రోజుల్లో.. రైల్వేస్టేష‌న్లు.. ఫ్లాట్ ఫాంలే కాకుండా రైళ్ల‌కు కూడా ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఈ ర్యాంకుల పుణ్య‌మా అని అయినా రైల్వేస్టేష‌న్లు.. రైళ్లు బాగుప‌డితే అంత‌కు మించి కావాల్సిందేముంది?