Begin typing your search above and press return to search.
గ్యాస్ లీక్: విశాఖ కంపెనీ గురించి షాకింగ్ నిజాలు
By: Tupaki Desk | 7 May 2020 10:50 AM GMTఎల్.జీ. పాలిమర్స్ ఇండియా. విశాఖలోని ఈ రసాయనాల ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి 8మంది మృతి చెందారు. 200 మంది అస్వస్థతకు గురయ్యారు. పెను విషాదాన్ని సృష్టించిన ఈ కంపెనీ దక్షిణ కొరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎల్.జీ గ్రూప్ కెమికల్స్ కంపెనీల్లో ఒక ప్లాంట్. ముంబైలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
*ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు?
1961లో దేశీయ దిగ్గజ హిందూస్థాన్ కంపెనీ ఈ పాలీమర్స్ , కోపాలిమర్స్ ప్లాంట్ ను విశాఖలో నెలకొల్పింది. ఆ తర్వాత ఈ కంపెనీని 1978లో ‘మెక్ డొనాల్డ్-యూబీ గ్రూప్’ కొనుగోలు చేసింది.
1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్.జీ కంపెనీ దేశంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో భారతదేశాన్ని ఒక ముఖ్యమైన మార్కెట్ గా ఎంచుకుంది. ‘మెక్ డొనాల్డ్-యూబీ గ్రూప్’ నుంచి 1997లో ఈ కంపెనీని కొని ‘ఎల్.జీ పాలిమర్స్ ఇండియా’ పేరు మార్చింది.
ఈ ఎల్.జీ పాలిమర్స్ కంపెనీలు.. భారతదేశంలో పాలీ స్టైరిన్ తయారీలో ప్రముఖ కంపెనీలుగా ఉన్నాయి. గోపాలపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటపురం గ్రామంలో ఈ కంపెనీ లో కూడా ఉత్పత్తి బాగానే జరుపుతోంది.
అయితే లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత సడన్ గా ప్రారంభించిన కంపెనీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా పనులు ప్రారంభించడంతో ఇన్నాళ్లు మూతపడ్డ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యింది. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ప్లాంట్ నుంచి పివిసి గ్యాస్ లేదా స్టైరిన్ లీకైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీజన గుమ్మల్లా తెలిపారు. కాంపౌండ్ గ్యాస్ లీక్ కావడంతో, పరిసరాల్లో నివసిస్తున్న వందలాది మంది ప్రజలు దీనిని పీల్చుకొని అపస్మారక స్థితిలో పడిపోయారు. శ్వాసకోశ సమస్యలపై ఫిర్యాదు చేశారు.
అపస్మారక స్థితిలో పడి 70 మందికి పైగా ఇక్కడి కేజీ ఆసుపత్రిలో ఆసుపత్రి పాలయ్యారు. అందరికంటే మొదట 8 ఏళ్ల బాలిక ఈ గ్యాస్ కు బలైంది. ఒక వ్యక్తి బావిలోకి దూకి చనిపోయాడని, మరొక వ్యక్తి తన ఇంటి బాల్కనీలో నుంచి పడిపోయి చనిపోయాడని సమాచారం.