Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన విశాఖ రియల్ లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   15 Dec 2016 7:40 AM GMT
హాట్ టాపిక్ గా మారిన విశాఖ రియల్ లవ్ స్టోరీ
X
రీల్ ప్రేమ కథల్ని తలదన్నే రియల్ ప్రేమ కథ ఇది. ఈ లవ్ స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్.. ఆఖర్లో ఉంటుంది. సినిమాల్లో కూడా కనిపించని ఈ సీన్ రియల్ గా జరిగింది. విశాఖపట్నంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్న ఈ లవ్ స్టోరీ ఉదంతంలోకి వెళితే..

అన్ని సినిమాల్లో మాదిరి ఒక అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకున్నారు. చాలా జంటలకు ఎదురైనట్లే.. అమ్మాయి ఇంట్లో వారి ప్రేమకు నో చెప్పేశారు. అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఓపక్క అమ్మాయి ఎంగేజ్ మెంట్ జరుగుతోంది. ఇది తెలుసుకున్న కుర్రాడు.. అక్కడకు వెళ్లాడు. మరికాసేపట్లో ఎంగేజ్ మెంట్ జరుగుతున్న వేళ.. వేదిక మీద ఉన్న అమ్మాయిని ఆ కుర్రాడు ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చాడు.

వేదిక మీద ఉన్న తన ప్రేయసి దగ్గరకు వెళ్లిన కుర్రాడు.. చప్పున ముద్దు పెట్టేసుకున్నాడు. దీంతో.. ఎంగేజ్ మెంట్ కు వచ్చిన వారు షాక్ తిన్నారు. మామూలుగా అయితే.. ఇలాంటి సీన్ జరిగిన వెంటనే.. పెళ్లి కొడుకు.. పెళ్లికూతురు తరఫు వారు కలిసి కుర్రాడిని చితకబాదేయటం లాంటివి చేస్తారు. కానీ.. ఈ రియల్ స్టోరీలో ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.

తన ప్రేయసిని అందరి ముందు ముద్దు పెట్టుకున్న అతగాడు.. ఆ అమ్మాయి అంటే తనకు ఎంత ఇష్టమన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. అంతే.. అమ్మాయి తల్లిదండ్రులు ఆ కుర్రాడి మాటలకు కన్వీన్స్ అయిపోయి.. ఆ అబ్బాయితో పెళ్లి చేసేందుకు ఓకే చేశారు. ఇక.. పెళ్లి చేసుకోవాలని వచ్చిన పెళ్లి కొడుకు.. ఊసూరు మంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. రీల్ స్టోరీని తలదన్నేలా లేదు.. ఈ రియల్ స్టోరీ..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/