Begin typing your search above and press return to search.
విశాఖ ఎయిర్ పోర్టు ఎపిసోడ్ మొత్తం పక్కా ప్లాన్ అట.. చెప్పిందెవరంటే?
By: Tupaki Desk | 24 Oct 2022 4:09 AM GMTతిరుగులేని అధిక్యతను చూపించాలే తప్పించి.. ఎక్కడా తగ్గేందుకు ఇష్టపడని వైసీపీ సర్కారుకు.. ఆ పార్టీ నేతలకు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చింది విశాఖపట్నం ఎయిర్ పోర్టులోని జనసేన అభిమానుల ర్యాలీ. తమ అధినేతను తరచూ ఇష్టారాజ్యంగా మాట్లాడే నేతల్ని చూసే సరికి.. జనసేనకు చెందిన కొందరు పట్టు తప్పడం.. వారిపై విరుచుకుపడటం.. దాడి పేరుతో నిరసన వ్యక్తం చేయటం లాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నిరసన తెలపటం.. ఆందోళన చేయటాన్ని సమర్థించొచ్చు కానీ.. ప్రజాస్వామ్యంలో అవతల వారు ఎలాంటి వారైనా సరే.. వారిపై దాడికి యత్నించటాన్ని సమర్థించలేం. అయితే.. ఎయిర్ పోర్టు వద్ద మంత్రుల్లో ఒకరైన ఆర్కే రోజా వేలును చూపిన వైనంతో జనసేన నేతలు చెలరేగిపోయారన్న వాదన వినిపిస్తున్నా.. దాడి మాత్రమే చట్టం లెక్కలోకి వస్తుందే తప్పించి.. ఇవేమీ రావన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికే పెద్ద ఎత్తున అరెస్టులు చేసి.. రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేయటం.. వారిలో పలువురికి ముందే బెయిల్ రాగా.. ఆ తర్వాత మిగిలిన వారికి రావటం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద చోటు చేసుకున్న దాడి మొత్తం అప్పటికప్పుడు జరగలేదని.. అదంతా వ్యూహాత్మకంగానే సాగినట్లుగా విశాఖపట్నం పోలీసు కమిషనర్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముందస్తు పథకంలో భాగంగానే విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. జనసేన నేతలు చెబుతున్న మాటలన్ని అసత్య ప్రచారాలుగా కొట్టివేయటం గమనార్హం.
మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన ఏం చెప్పారంటే?
- అక్టోబరు 15 మధ్యాహ్నం రెండు గంటలకు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కు వెళతారని.. 16న పోర్టు కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం ఉందని.. 17న వైఎంసీఏలో జరిగే ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళతారని మాత్రమే పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు ర్యాలీ.. డీజే.. భారీ జనసమీకరణల గురించి సదరు లేఖలో చెప్పలేదు. అందుకు అనుమతి తీసుకోలేదు.
- డ్రోన్ వాడేందుకు అనుమతి కోరారు. రిమోట్ పైలెట్ ఎయిర్ క్రాఫ్ట్ అనుమతి లేకపోవటంతో దాన్ని రిజెక్టు చేశాం. సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ ముందస్తుగా అనుమతులు లేకుండా భారీ ఎత్తున జనసమీకరణ చేసి ఎయిర్ పోర్టుకు తరలించారు.
- విశాఖ గర్జన ప్రోగ్రాం పూర్తి చేసుకొని ఎయిర్ పోర్టుకు వచ్చిన మంత్రులు రోజా.. రజిని.. జోగి రమేశ్.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీ నేతల వాహనాలపై జనసేన నేతలు.. కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున దాడి చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
- ఈ దాడిలో మంత్రి రోజాపై దాడికి యత్నించగా.. పీఏ దిలీప్ తలకు తీవ్ర గాయమైంది. పెందుర్తి సీఐ నాగేశ్వరరావుకు గాయమైంది. వారిచ్చిన ఫిర్యాదులతో దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. దాడులు అప్పటికప్పుడు నిర్ణయించుకున్నవి కావు. వివిధ సమూహాల వ్యక్తులు.. వేర్వేరు మంత్రులు.. నాయకుల్ని టార్గెట్ చేస్తూ ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే దాడులు చేశారు.
- ఆ రోజున 70 మందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టాం. వారిలో తొమ్మిది మందికి రిమాండ్ విధించారు. మిగిలిన వారికి బెయిల్ వచ్చింది. ఈ ఉదంతానికి సంబంధించి మొత్తం ఆరు కేసులు నమోదు చేసి.. ఇప్పటివరకు వంద మందిని అరెస్టు చేశాం. 82 మంది పరారీలో ఉన్నారు.
- ర్యాలీకి అనుమతి లేదన్న విషయాన్ని పవన్ కు డీసీపీ సుమిత్ తెలిపారు. అంతే తప్పించి పవన్ పై దురుసుగా ప్రవర్తించాలన్న ఉద్దేశం లేదు. జనసేన నాయకులు చేసే ఆరోపణలు పూర్తిగా అసత్యాలు. యువత క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని తమ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించొద్దు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.