Begin typing your search above and press return to search.
వాళ్లు ఉగ్రవాదులు కాదు.. టూరిస్ట్ లేనంట
By: Tupaki Desk | 28 Jan 2016 6:31 AM GMTఐదుగురు విదేశీయులకు సంబంధించిన వ్యవహారం అస్పష్టంగా ఉండటం.. వారికి సంబంధించిన వివరాలు అడిగిన వెంటనే వారు వెళ్లిపోవటం లాంటి పరిణామాలతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వారు ఇరాన్ నుంచి రావటం.. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఉగ్రవాదులన్న సందేహాల నడుమ ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది.
కారులో ప్రయాణిస్తున్న ఈ ఐదుగురు విదేశీయుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లుగా తేలింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఈ కారును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విశాఖపట్నానికి తరలించి విచారణ చేపట్టారు. అయితే.. వారు ఉగ్రవాదులు కాదని.. కేవలం టూరిస్ట్ లుగానే భారత్ లోకి అడుగు పెట్టినట్లుగా పోలీసులు నిర్థారించారు. విశాఖ జిల్లాలోకి రావటానికి ముందు వారు ఒడిషాలోని ఒక హోటల్ లో బస చేసేందుకు వెళ్లటం.. అక్కడ వారిని పాస్ పోర్ట్ లు చూపించమని కోరటం.. అందుకు వారు నిరాకరించి వెళ్లిపోవటంతో వీరిపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
దేశంలోని ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఈ ఐదుగురి మీద అనుమానంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకొని విచారించి.. వారు ఉగ్రవాదులు కాదని తేలటంతో రెండు రాష్ట్రాల పోలీసులు టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యారు.