Begin typing your search above and press return to search.

నిరుద్యోగంలో విశాఖకు ఫస్ట్ ర్యాంక్..

By:  Tupaki Desk   |   17 March 2022 9:23 AM GMT
నిరుద్యోగంలో విశాఖకు ఫస్ట్ ర్యాంక్..
X
ఏపీలోని విశాఖ జిల్లాకు ఫస్ట్ ర్యాంకు వచ్చేసింది. అయితే ఏ ప్రగతిలోనో.. లేక క్రీడల్లోనో కాదు. నిరుద్యోగంలో.. రాష్ట్రంలో రెండో ప్రధాన నగరంగా పేర్కొంటున్న విశాఖ టాప్ ప్లేసులో నిలిచింది. అన్ని విధాలుగా గ్రోత్ ఇంజిన్ గా పేర్కొంటున్న విశాఖకు ఈ ర్యాంకు రావడంపై తీవ్ర చర్చనీయాంశంగామారింది. విశాఖ జిల్లాలో దాదాపు లక్ష వరకు నిరుద్యోగులు ఉన్నారని, వీరు ఏ పనిచేయకుండా ఉన్నట్లు లెటేస్ట్ ప్రభుత్వ అధికారిక లెక్కలు లేల్చాయి. అధికారికంగానే ఇలా ఉంటే ఇక అసలు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారోనన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల జాబితాను ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. ఇందులో ఫస్ట్ ర్యాంక్ విశాకకే రావడం గమనార్హం. రాష్ట్రం మొత్తంలో 6,16,689 మంది నిరుద్యోగులు ఉండగా.. ఇందులో విశాఖలోనే 98 వేల 504 మంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఆ తరువాత స్థానంలో కర్నూలు లో 64,294 మంది ఉండగా మూడో స్థానంలో కడపలో 56,837 మంది నిరుద్యోగులు ఉన్నారు. అయితే నిరుద్యోగం అంటే ప్రభుత్వం ఉద్యోగం లేనివారని అంటున్నా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు వెళ్లాలని కొందరు మేధావులు సూచిస్తున్నారు.

అయితే ఇటీవల వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించిన వాటిల్లో విశాఖ పేరు కూడా ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అయితే ఆనూహ్యంగా మూడు రాజధానుల విషయం వెనక్కి తీసుకున్న సీఎం విశాఖ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.

అయితే విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరంగా కొందరు పేర్కొన్నారు. కానీ ఇలా నిరుద్యోగంలో మాత్రం ఫస్ట్ ర్యాంక్ రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం లేదని, నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొందరు వాపోతున్నారు.

కానీ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉద్యోగం కావాలంటే దొరకదని, ఇతర ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి వైపు వెళ్లాలని కొందరు సూచిస్తున్నారు. అయితే విశాఖలో పలు అభివృద్ధి పనులు చేపడుతన్నామని చెప్పినప్పటికీ ఆ దిశగా వెళ్లడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా ఇలా నిరుద్యోగంలో విశాఖ చాలా వెనకబడి ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.