Begin typing your search above and press return to search.
కూల్చివేతల పర్వం..విశాఖ వంతు!
By: Tupaki Desk | 8 Nov 2022 4:43 PM GMTమంగళగిరిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న కారణంతో జనసేన మద్దతుదారులపై ప్రభుత్వం, అధికారులు కక్ష సాధించారన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ పనుల సాకు చూపించి జనసేన మద్దతుదారులపై వైసిపి ప్రభుత్వం పగ తీర్చుకుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటం ఘటన మరువక ముందే తాజాగా జగన్ సర్కారు విశాఖలో మరో మారు కూల్చివేతల పర్వానికి తెర తీసింది.
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ సమీపంలో ఉన్న పాన్ షాపులు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, కూరగాయల దుకాణాలను అధికారులు ఉన్నపళంగా జెసిబిలతో కూల్చివేయడం సంచలనం రేపుతోంది. వాస్తవానికి ఈ నెల 12వ తేదీన విశాఖలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో బహిరంగ సభ జరగనుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
అయితే, గ్రౌండ్స్ కు సమీపంలోని పోలేరమ్మ ఆలయం దగ్గర చిన్నచిన్న దుకాణాలు చాలా ఉన్నాయి. దీంతో, సభ సందర్భంగా ఆరోజు దుకాణాలు తీయవద్దంటూ పది రోజులు క్రితం అధికారులు ఆ దుకాణ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ, హఠాత్తుగా సోమవారం అర్ధరాత్రి చెప్పాపెట్టకుండా మున్సిపల్ సిబ్బంది జెసిబిలతో తమ దుకాణాలను కూల్చివేశారని దుకాణదారులు కన్నీరు మున్నీరవుతున్నారు.
పాతికేళ్లుగా ఈ దుకాణాలే తమకు అన్నం పెడుతున్నాయని, కనీసం మాట మాత్రం చెప్పకుండా రాత్రికి రాత్రి దుకాణాలు కూల్చివేయడం ఏం న్యాయమని వారు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఆరోజు దుకాణాలు తెరవవద్దని మాత్రమే చెప్పారని, దుకాణాలు కూల్చివేస్తామని చెప్పి ఉంటే తమ సామాగ్రిని వేరే చోటికి తరలించుకుని ఉండేవారమని వారు వాపోతున్నారు.
2 నెలల క్రితమే తాను రెండున్నర లక్షల రూపాయలు అప్పు చేసి మరీ కొత్త రేకులు కొన్ని షెడ్డు వేసుకుని అందులో వ్యాపారం చేసుకుంటున్నానని ఓ దుకాణదారుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. తాము ఉగ్రవాదులం కాదని, కానీ అణుబాంబు వేసినట్లుగా జెసిబిలు పెట్టి తమ దుకాణాలను కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.