Begin typing your search above and press return to search.
భారీ నష్టాల్లో విశాఖ ఉక్కు
By: Tupaki Desk | 26 Oct 2022 4:25 AM GMTప్రైవేటుపరం కాబోతున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. సంస్ధకు ప్రస్తుత ఏడాది రు. 1260 కోట్ల నష్టాలు పేరుకుపోయాయి. నష్ట జాతక సంస్ధగా ముద్రవేసి ఫ్యాక్టరీని ఎలాగైనా ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఎవరెంత మొత్తుకుంటున్నా ముడి ఇనుము గనులు కేటాయించటం లేదు. పోనీ ముడి ఇనుము సరఫరాను సక్రమంగా చేస్తోందా అంటే అదీలేదు.
గనులూ కేటాయించక, రా మెటీరియల్ ముడి ఇనుమును సరఫరా చేయకపోతే ఇక ఉక్కు ఉత్పత్తి ఎలాగ జరుగుతుంది ? అందుకనే ఉత్పత్తి పడిపోతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్యాక్టరీ నడవటానికి అవసరమైన బొగ్గు నిల్వలను కూడా సరిపడా సప్లై చేయటం లేదు. ఖాళీ అవుతున్న ఉద్యోగులు, కార్మికుల పోస్టులను భర్తీని నిలిపేసింది. తయారైన ఉక్కును ఇతర ప్రాంతాలకు సరఫరా చేయటానికి అవసరమైన రైల్వేర్యాకులను కూడా కేటాయించటంలేదు.
ఏ విధంగా చూసినా ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలన్నది టార్గెట్ గా కేంద్రప్రభుత్వం పెట్టుకున్న విషయం స్పష్టమైపోతోంది. ఉక్కు తయారీలో ఎంతో అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఒకదాని తర్వాత మరొకటి మూసేస్తోంది.
మొన్నటి జనవరిలో బ్లాక్ ఫర్నేస్ యూనిట్ ను కేంద్రం మూసేసింది. దీనివల్ల ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడింది. దీని కారణంగా ఉక్కు ఉత్పత్తి సుమారు 20 వేల టన్నుల నుండి 10 వేల టన్నులకు పడిపోయింది.
సంస్ధలోని కీలకస్ధానాల్లో ఉండే అధికారులను బదిలీలు చేసేయటం, ఖాళీలను భర్తీ చేయకపోవటం వల్ల అత్యవసరమైన నిర్ణయాలను వెంటనే తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవటంలో విపరీతమైన ఆలస్యం అవుతుండటంతో ఫైనల్ గా దాని ప్రభావం ఉక్కు ఉత్పత్తిమీదే పడుతోంది.
ఫ్యాక్టరీ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వానికి బదిలీచేయమని జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు కేంద్రప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానంలేదు. మొత్తంమీద వీలైనంత తొందరలో ఫ్యాక్టరీని మూసేయటమనే టార్గెట్ తో నరేంద్రమోడీ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు స్పష్టంగా తెలిసిపోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.