Begin typing your search above and press return to search.

ప్రైవేట్ మంత్ర... ఉక్కు హుళక్కేనా...?

By:  Tupaki Desk   |   1 Feb 2022 11:30 PM GMT
ప్రైవేట్ మంత్ర... ఉక్కు  హుళక్కేనా...?
X
తాజా బడ్జెట్ లో సైతం ఏపీకి పెద్దగా ఒరిగింది లేదు అన్న కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. అదే టైమ్ లో దాదాపు ఏడాదిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనల మీద ఉక్కు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో ఏమైనా చల్లని కబురు ఉంటుందేమో అని అంతా ఎదురు చూశారు.

అయితే బడ్జెట్ వేళ మరింతగా ప్రైవేట్ మంత్రాన్ని కేంద్రం జపించడంతో ఉక్కు ఆశలు హుళక్కి అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీని మీద స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు సైతం గరం గరం అవుతున్నారు.

విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం చూస్తోందని ఉద్యమ నేత సీహెచ్ నరసింగరావు విరుచుకుపడ్డారు. ముక్కలుగా చేసి విశాఖ ఉక్కుని తెగనమ్మాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్ వేళ సైతం కేంద్రం ప్రైవేటీకరణ నినాదాన్ని ఎత్తుకోవడం కంటే దురదృష్టకరం మరోటి ఉండదు అని ఆయన అంటున్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రస్తుతం జోరుగా సాగుతోందని, ఇక మీదట మరింతగా ఉద్యమిస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్ పారిశ్రామిక రంగానికి చేయూతను ఇవ్వలేకపోతే ప్రైవేట్ వైపుగా నడిపించేలా ఉందని కార్మిక సంఘాలు అంటున్నాయి.