Begin typing your search above and press return to search.
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమే....?
By: Tupaki Desk | 27 Feb 2022 2:30 PM GMTవిశాఖ ఉక్కు ఏపీకి హక్కు, ఒక విధంగా గర్వకారణం. సాగర తీరాన ఉన్న ఏకైన ప్లాంట్ ఇదే. కారు చౌకగా ఉన్న జల రవాణాను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. విశాఖ ఉక్కు నాణ్యమైనది. ప్రపంచానికి కావలసినది. లాభాల బాటలో పయనించాలీ అంటే సొంత గనులు ఇస్తే చాలు.
అలాంటి ప్లాంట్ ని నష్టాలు అన్న సాకు చూపించి తెగనమ్మడానికి కేంద్రం చూస్తోంది. గత ఏడాది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా విశాఖ ఉక్కుని బలిపీఠం మీద పెట్టారు. ఏడాది కావస్తున్న కేంద్ర పెద్దల వైఖరిలో మార్పు లేదు. ఉక్కు కార్మికులు ఒక క్యాలండర్ ఇయర్ నుంచి ఉద్యమాలు చేస్తున్నా కూడా ఎవరూ గట్టిగా స్పందించడంలేదు.
మరి ఏపీకి చెందిన బీజేపీ నేతలు అయినా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో ఉంచాలని చూస్తున్నారా అంటే వారు కూడా ప్రైవేట్ పాటే పాడుతున్నారు. అయితే ఆ ముక్క గట్టిగా చెప్పకుండా అందంగా, అర్ధం కాని విధంగా వేరే విధంగా చెప్పుకొస్తున్నారు. తాజాగా విశాఖ టూర్లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఇలాగే మాట్లాడారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలన్నది కేంద్ర విధానం అన్నారు. ఇక విశాఖలో ఉక్కుని ప్రైవేట్ చేసినా మరేమీ చేసినా కూడా అది విశాఖలోనే కదా ఉంటుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కుని ఎక్కడికో కేంద్రం తీసుకుపోవడం లేదు కదా అని కూడా అడుగుతున్నారు.
విశాఖ ఉక్కుని మరింత సమర్ధవంతంగా పనిచేయించడానికి కొత్త టెక్నాలజీ జత చేయడానికే కేంద్రం చూస్తోందని, అదే విధంగా ఎవరో ఒకరి చేతుల్లో ఈ కర్మాగారాన్ని పెట్టడం జరగదని, టెండర్లు పిలిచి మరీ ఎవరికి అప్పగించాలో నిర్ణయిస్తామని కూడా చెబుతున్నారు.
అదే సమయంలో విశాఖ ఉక్కు కోసం వేలాదిగా ఎకరాలు భూములు ఇచ్చిన నిర్వాసితుల గోడు ఏంటి అంటే వారి భూములను ప్రభుత్వం అమ్మబోదని అంటున్నారు. భూములు అలాగే ఉంటాయి, కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కాదు అన్న మాట మాత్రం పురంధేశ్వరి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వ రంగంలో ఉంటే సమర్ధంగా విశాఖ ఉక్కు పనిచేయదని ఎందుకు అనుకుంటున్నారో తెలియడంలేదు.
ఇక విశాఖ ఉక్కుకు కావాల్సిన సొంత గనులను కేంద్రం సమకూర్చాల్సిన ఉందని, ఆ విషయంలో ఎందుకు చొరవ చూపరని అడిగినా పట్టించుకోరు. పైగా తాము ఏడేళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నామని, గత ప్రభుత్వాలు ఎందుకు సొంత గనులు కేటాయించలేదని పురంధేశ్వరి నిలదీయడాన్ని చూసి శభాష్ అనాలేమో.
మొత్తానికి భూములిచ్చిన నిర్వాసితులు వాటిని అమ్ముతారా కేంద్రం వద్ద అట్టేబెట్టుకుంటారా అని అడగడంలేదు, తాము ఇచ్చిన భూములలో స్టీల్ ప్లాంట్ ని విస్తరించాలని, తమ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. అంతే కాదు, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
అలాగే స్టీల్ కార్మికులు కూడా ప్రైవేట్ చేస్తామంటే అసలు ఊరుకోరు. ప్రభుత్వమే నడపాలని కోరుతున్నారు. మరి ఈ విషయాలు అన్నీ కూడా తెలిసి మరీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పదే పదే గందరగోళం పరచే ప్రకటనలు ఇవ్వడం బీజేపీ పెద్దలకే చెల్లిందేమో. ఏది ఏమైనా మరింతగా మలివిడత ఉద్యమాన్ని నిర్మిస్తామని, ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని కార్మిక లోకం అంటోంది.