Begin typing your search above and press return to search.

ఆక్సిజన్ తయారీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రికార్డ్ !

By:  Tupaki Desk   |   26 April 2021 10:30 AM GMT
ఆక్సిజన్ తయారీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రికార్డ్ !
X
ఆక్సిజన్ కరోనా బాధితులకి ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా చనిపోయే వారి సంఖ్య కంటే , ఆక్సిజన్ అందక చనిపోయే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. కరోనా భారిన పడిన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరం. దీనితో చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తో కరోనా బాధితులు మృతి చెందుతున్నారు. శ్వాశతీసుకోవటంలో ఇబ్బందులు మొదలైనా వెంటనే ఆక్సిజన్ చాలా అవసరం అన్నది కూడా వాస్తవమే. ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో గడచిన 12 రోజుల్లో 1300 టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. గడచిన నాలుగు రోజులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఆక్సిజన్ ఉత్సత్తిని రోజుకు 100 టన్నుల నుండి 140 టన్నులకు పెంచేశారు.

దేశంలో మొదలైన మొట్టమొదటి ఆక్సిజన్ ట్రైన్ విశాఖ నుండి 100 టన్నుల ద్రవీకృత ఆక్సిజన్ను తీసుకుని మహారాష్ట్రకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ లెక్క ప్రకారం దేశంలోని ఉక్కు ఫ్యాక్టరీలన్నీ తమ సామర్ధ్యాన్ని మించే ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయట. ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లోని ఉక్కు ఫ్యాక్టరీల్లో 33 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటి రోజువారి ఆక్సిజన్ ఉత్సత్తి సామర్ధ్యం 2834 టన్నులు. అయితే, ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్నిప్లాంట్ల లో కలిపి 3474 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు.

అయితే, ఎన్ని ప్లాంట్స్ లో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నా కూడా రోగుల అవసరాలకు అది ఏమూలకు సరిపోవటంలేదు. ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. కరోనా రోగం విషమించి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ దొరక్క చనిపోతున్న వారిసంఖ్య పెరిగిపోతుండటమే బాధాకరం. మరి ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ అంతా ఎటుపోతోంది, అంటే ఊహించనిరీతిలో రోగుల ఆసుపత్రులకు వచ్చేస్తుండటంతో డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఉదాహరణకు 10 పడకల ఆసుపత్రికి 10 మంది వస్తే వైద్యం చేయగలరు. అయితే ఒక్కసారిగా 100 మంది వచ్చేస్తే ఏం చేయగలరు. ఇపుడు జరుగుతున్నదిదే. అందుకే ప్రభుత్వాలైనా, డాక్టర్లయినా ఏమి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అందుతున్నలెక్కల ప్రకారం ప్రతి వందమంది కరోనా రోగుల్లో 20 మందిలో తీవ్రమైన లక్షణాలు ఉంటున్నాయి. వారిలో ముగ్గురికి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఉంటోంది. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో అన్ని రాష్ట్రాలూ తమ మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిని వైద్య అవసరాల కోసమే వినియోగిస్తున్నారు.