Begin typing your search above and press return to search.
ఎంత ప్రతిభ చాటుకున్నా... విశాఖ ఉక్కు దక్కేలా లేదుగా... ?
By: Tupaki Desk | 23 Dec 2021 4:30 PM GMTవిశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర ఎంతో ఘనం. దాని ఏర్పాటు వెనక ఉన్న అమరుల త్యాగం వెలకట్టలేనిది. ఇక ఇప్పటికి యాభై ఏళ్ల క్రితం విశాఖలోని అనేక గ్రామాల రైతులు తమ ప్రాంతానికి ఉక్కు కర్మాగారం వస్తోంది అని భావించి ఆనందించి పాతిక వేల ఎకరాల దాకా భూములను ఇచ్చారు. ఇలా త్యాగాల పునాది మీద ఏర్పాటు అయిన విశాఖ ఉక్కు దేశంలోనే మేటి అనిపించుకుంది.
అయితే నష్టాల పేరిట విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించే ప్రయత్నాలను చేస్తున్నారు. దేశంలో సీ షోర్ లో ఏర్పాటు అయిన ఒకే ఒక్క అతి పెద్ద ప్లాంట్ ఇది. ఏ సంస్థకు అయినా లాభాలు, నష్టాలు అన్నది సహజం. అయితే సొంత గనులు ఉంటే విశాఖ ఉక్కు ఏనాడో లాభాల బాట పట్టేది అన్నది నిజం.
కానీ అవన్నీ కేంద్ర పాలకులకు పట్టడంలేదు అని ఉక్కు ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటై దశాబ్దాలు గడచినా కూడా ఈ రోజుకీ సొంత గనులు కేటాయించలేదు, ఇపుడు మాత్రం నష్టాలే కారణం అంటున్నారు అని వాపోతున్నారు. కేవలం 22 వేల కోట్ల రూపాయాలు మాత్రమే విశాఖ స్టీల్ కి అప్పులు ఉన్నాయి. వాటిని మూలధనంలో కలిపితే విశాఖ ఉక్కు దర్జాగా మళ్లీ నిలబడుతుంది.
ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. రైలు చక్రాలు తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత వేరు. భారీ ఆర్డర్స్ కూడా ఈ ప్రెస్టేజియస్ సంస్థకు అలాగే వస్తాయి. లోకో వీల్స్ కి సంబంధించి ఒక పెద్ద ఆర్డర్ ని గతంలో ప్లాంట్ సొంతం చేసుకుంది.
అందులో తొలి విడతగా 51 లోకో వీల్స్ తయారీ చేసింది. లోకో వీల్స్ తయారీ కోసం 1700 కోట్ల రూపాయలతో లాల్ గంజ్, రాయబరేలీలో ప్రత్యేక యూనిట్‌ని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పట్లో నెలకొల్పింది. లాల్ గంజ్ నుంచి తొలిసారిగా లేటెస్ట్ గా 51 లోకో వీల్స్‌ని భారతీయ రైల్వేస్ కి విశాఖ స్టీల్స్ ఉన్నతాధికారులు పంపించారు.
ఇదే తీరున మరిన్ని విడతల ఉత్పత్తులు కూడా త్వరలోనే సరఫరా చేయనున్నారు. ఇదొక్కటే కాదు, రెండవ దశ కరోనా వేళ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చేసిన సేవ నిరుపమానం. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తులను నాడు తయారు చేసి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. దేశానికే ఆదర్శంగా నిలిచింది. అలాంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడం మానుకోవాలని అంతా కోరుతున్నారు. చూడాలి మరి కేంద్ర పెద్దల మనసు ఏ మాత్రం అయినా మారుతుందో లేదో.