Begin typing your search above and press return to search.
టీడీపీ ఎంపిలు వెనక్కు తగ్గకూడదు
By: Tupaki Desk | 17 July 2021 7:07 AM GMTస్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలకు సైతం సిద్ధమంటు టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నట్లు ఎంపి చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ముందుండి పోరాటం చేయాలని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. ఎలాగూ రాజీనామాలకు సిద్ధమైనపుడు ఇంకెందుకు ఆలస్యం. వెంటనే రాజీనామాలు చేసేయొచ్చు కదా .
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ చేసే పోరాటాలతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగదని అందరికీ తెలుసు. ఇప్పటికైతే స్టీల్ ఫ్యాక్టరీనీ ప్రైవేటుపరం చేసేయటానికే నరేంద్రమోడి సర్కార్ రెడీ అయిపోతోంది. కాబట్టి జగన్ అడ్డుపడినా ప్రైవేటీకరణ ఆగేది అనుమానమే. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రప్రభుత్వ సంస్ధ అన్న విషయం అందరికీ తెలిసిందే. మోడి ప్రైవేటీకరణ చేయాలని డిసైడ్ చేస్తే ఎవరూ అడ్డుకోలేరన్న విషయం టీడీపీకి కూడా బాగా తెలుసు.
అయితే రాజకీయంగా జగన్ను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే రాజీనామాల ప్రకటన చేస్తున్నారు. తాము రాజీనామాలు చేయాలని డిసైడ్ అయినపుడు ఇక జగన్ పోరాటాలతో టీడీపీ ఎంపిలకు ఏమిపని. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రత్యేకహోదా మీద ఎంపిలందరితో రాజీనామాలు చేయించాలని జగన్ చెప్పినపుడు చంద్రబాబునాయుడు ఏమన్నా సానుకూలంగా స్పందిచారా ? లేదుకదా. ముందు సరే అనిచెప్పి తర్వాత యూటర్న్ తీసుకున్నారు.
అందుకనే కదా జగన్ తమ ఎంపిలతో ఏపి భవన్లో నిరాహారదీక్షలు చేయించింది. ఆ తర్వాత తమ ఎంపిలతో రాజీనామాలు కూడా చేయించారు కదా. దీక్షలకైనా, రాజీనామాలకైనా టీడీపీ ఎంపిలు కలిసి రాకపోయినా తమ ఎంపిలతోనే జగన్ రాజీనామాలు చేయించారు కదా. అపుడు వైసీపీ ఎంపిలు చేసినట్లుగానే ఇపుడు టీడీపీ ఎంపిలు కూడా రాజీనామాలు చేసి చిత్తుశుద్దిని నిరూపించుకోవచ్చు. ఒకవేళ వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేయకపోతే అప్పుడు జనాల్లో వాళ్ళే పలుచనవుతారు.
కాబట్టి జనాల్లో మంచిపేరు తెచ్చుకోవటానికి వచ్చిన అవకాశాన్ని టీడీపీ ఎంపిలు అస్సలు వదులుకోవద్దు. చెప్పినట్లుగా వెంటనే రాజీనామాలు చేసేస్తే జనాల్లో మంచి మైలేజీ వస్తుంది. అప్పుడు వైసీపీ ఎంపిలను బాగా ఇరుకున పెట్టినట్లవుతుంది. ఇంతటి బంగారం లాంటి అవకాశం మళ్ళీ రాదేమో. కాబట్టి టీడీపీ ఎంపిలు వెనక్కు తిరిగి చూడకుండా రాజీనామాలు చేసేయటమే.