Begin typing your search above and press return to search.
బొబ్బిలియుద్ధం పగలను చెరిపేసిన బాబు
By: Tupaki Desk | 20 April 2016 9:51 AM GMTబొబ్బిలి యుద్ధం గురించి విననివారు తెలుగు నేలపై దాదాపుగా ఎవరూ ఉండరు. తెలుగు నేలపైనే కాదు... భారతదేశమంతటా బొబ్బిలి యుద్ధం గురించి తెలుసు. ఎన్ని తరాలు మారినా కూడా ఇప్పటికే తెలుగు నేలపై జరిగిన యుద్ధాల్లో బొబ్బిలి యుద్ధానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. బొబ్బిలి యుద్ధంపై సినిమాలు కూడా వచ్చాయి... తాండ్రపాపారాయుడి వీరత్వంపైనా సినిమాలు వచ్చాయి... బొబ్బిలి అన్న పేరు పలికినా, చెవిన పడినా రోమాలు నిక్కబొడుస్తాయంటారు ఉత్తరాంధ్రులు. బొబ్బిలి యుద్ధం.. ఆ వీర గాధలను జానపద కళారూపాలు ఇప్పటికీ కథకథలుగా చెబుతాయి. 259 సంవత్సరాల కిందట జరిగిన ఈ యుద్ధం ప్రభావం ఇప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపిస్తూనే ఉంటుంది.
చిరకాల వైరం..
బొబ్బిలి రాజులు - విజయనగరం రాజుల మధ్య 1757 జనవరి 23న బొబ్బిలి వద్ద యుద్ధం జరిగింది. అంతకుముందు నుంచీ కూడా ఈ రెండు సంస్థానాల మధ్య వైరం ఉండేది. 1757కి కొద్దికాలం ముందు నుంచి ఉత్తరాంధ్ర సంస్థానాధీశులంతా ఫ్రెంచివారికి శిస్తు చెల్లించడం మానేశారు. ఒక్క విజయనగరం రాజులు మాత్రమే చెల్లిస్తుండేవారు. 1757లో ఫ్రెంచి జనరల్ బుస్సీ ఉత్తరాంధ్రకు వచ్చి రాజకీయం నడిపాడు. తమకు శిస్తు చెల్లించనివారిలో బలమైన రాజులైన బొబ్బిలి రాజులను ఇక్కట్లకు గురిచేయాలనుకున్నాడు. అందుకు బొబ్బిలి - విజయనగర రాజుల వైరాన్ని అవకాశంగా తీసుకున్నాడు. అప్పటి విజయనగరం రాజు విజయరామరాజు అండతో ఫ్రెంచి సైన్యాన్ని బొబ్బిలి కోటపైకి నడిపించాడు. వీరికి నిజాం సైన్యం - పెద్దాపురం రాజులు కూడా తోడయ్యారు. ఆ సమయానికి బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు బావమరిది - సైన్యాధ్యక్షుడైన తాండ్ర పాపారాయుడు రాజాం వద్ద ఉంటాడు. దీంతో బొబ్బిలిరాజా రంగారావే స్వయంగా యుద్ధంలో పాల్గొంటాడు. రాణీ మల్లమ్మదేవి వెంటనే తన సోదరుడు తాండ్ర పాపారాయుడికి కబురు పంపిస్తుంది.. కానీ, ఆ వేగులను విజయనగరం రాజు సైన్యం హతమార్చడంతో పాపారాయుడికి విషయం చేరదు. ఇంతలో విజయనగరం రాజులు - ఫ్రెంచి సైన్యం - మిగతావారు కలిసి మూకుమ్మడిగా దండయాత్ర చేయడంతో బొబ్బిలి రాజు వారిని ఎదిరించలేకపోతాడు. అప్పటికే రాజు బంధువులను - బొబ్బిలి ప్రజలను చిన్నాపెద్దా తేడాలేకుండా అందరినీ ప్రత్యర్థులు హతమార్చుకుంటూ పోతుండడంతో మరణం తప్పదని గ్రహిస్తాడు. రాణి మల్లమ్మ కూడా ఆత్మత్యాగం చేసుకుంటుంది. రాజా రంగారావును విజయనగరం రాజులు హతమారుస్తారు. తాండ్రపాపారాయుడు కోటకు వచ్చేసరికి రాజా రంగారావు - తన సోదరి మల్లమ్మ అందరూ రక్తపుటేరుల్లో ఉండడంతో ఆయన తన అనుచరులు ఇద్దరిని వెంటేసుకుని వెళ్లి విజయనగరం రాజుల శిబిరంలో చొరబడి విజయనగరం మహారాజైన పెద్ద విజయరామరాజును గుండెల్లో పొడిచి చంపేస్తాడు. ఆ తరువాత బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు కుమారుడు - అప్పటికి పసివాడైన చిన్న రంగారావు అనంతర కాలంలో బొబ్బిలి రాజవుతాడు. విజయనగరం సింహాసనం కూడా వారసులకు చెల్లుతుంది. కానీ... అప్పటి నుంచి రెండు రాజవంశాల మధ్య పూర్తి వైరం ఉంది.
తరాలు మారాయి.... రాజకీయంగా బొబ్బిలి రాజులు - విజయనగరం రాజులు కూడా స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కీలకంగా ఉన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోనూ కీలక పాత్ర పోషించారు. రెండు వంశాల వారూ తిరుగులేని ప్రజాభిమానం పొందారు. బొబ్బిలి రాజు రావు శ్వేతాచలపతి సర్ వెంకట కృష్ణ రంగారావు మూడుసార్లు మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కానిస్టున్సీ అసెంబ్లీ సభ్యుడిగా ఆ తరువాత ఏపీ అసెంబ్లీకి కూడా బొబ్బిలి రాజులు ఎన్నికయ్యారు. విజయనగరం రాజులు కూడా రాష్ట్రం - జాతీయ స్థాయిలో ప్రజాప్రతినిధులుగా సేవలందించారు. రెండు వంశాలవారికీ బ్రిటిష్ ప్రబుత్వం నుంచి సర్ వంటి అరుదైన గౌరవాలున్నాయి. రెండువంశాలవారు చేతికి ఎముకలేని దాతలుగా ప్రజల మన్ననలు పొందారు. విదేశాల్లో చదువుకుని విద్యావంతులయ్యారు. ప్రజాప్రతినిధులు - మంత్రులుగా సేవలందిస్తున్నారు కానీ ఎప్పుడూ ఎడమొహం పెడమొహమే. ఎక్కడా వారు కలవడం తటస్థించదు.
బొబ్బిలి రాజా రావు శ్వేతాచలపతి సర్ వెంకట కృష్ణ రంగారావు మరణించినప్పుడు కూడా విజయనగరం రాజులెవరూ వెళ్లలేదు. ఆ తరువాత చాలాకాలం పొలిటికల్ గ్యాప్ తరువాత బొబ్బిలి రాజులు మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు - ఆయన తమ్ముడు బేబీనాయనలు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో వారు టీడీపీలో చేరాలనుకున్నారు. కానీ, టీడీపీలో అప్పటికే మంచి పొజిషన్ లో ఉన్న విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు వారి రాకను వ్యతిరేకించారు. దీంతో వారు కాంగ్రెస్ లో చేరారు. బేబీ నాయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెటిచ్చింది.. కానీ, ఆయనకు వయసు చాలలేదు.. దీంతో ఆయన అన్న సుజయ కృష్ణ రంగారావు పోటీ చేసి గెలిచారు. అనంతర కాలంలో అన్నదమ్ములిద్దరూ వైసీపీలో చేరారు. కానీ, అక్కడ జగన్ గౌరవించినా బొత్స వంటి నేతలు రావడంతో వారు అక్కడ ఇమడలేక టీడీపీలోకి రావాలనుకున్నారు.
చారిత్రక కలయిక..
ఈసారి పరిస్థితులు మారాయి. విజయనగరం రాజు అశోక్ గజపతి అప్పటి కంటే కూడా టీడీపీలో పెద్ద నేతయ్యారు. కానీ, ఈసారి ఆయన బొబ్బిలి రాజులను వ్యతిరేకించలేదు. బొబ్బిలి రాజులు కూడా వైరం మరిచి అశోక్ తో సయోధ్యకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. బొబ్బిలి రాజు, ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు విజయనగరం కోటలోకి వెళ్లి అశోక్ ను కలిశారు. అశోక్ అన్నగారు ఆనందగజపతి రాజు మరణించడంతో అశోక్ ను పరామర్శించడం కోసం బొబ్బిలి బ్రదర్సు ఇద్దరు విజయనగరం కోటలో అడుగుపెట్టి అశోక్ ను పరామర్శించారు. 259 ఏళ్ల వైరానికి ముగింపు పలకడానికి ముందడుగు వేశారు. అశోక్ కూడా వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని మాట్లాడారు. అక్కడికి వారం రోజుల్లోనే మళ్లీ టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో బొబ్బిలి రాజులు మరోసారి విజయనగరం కోటకు వెళ్లి అశోక్ తో సమావేశమయ్యారు.
తాజాగా ఈరోజు బొబ్బిలి రాజులు టీడీపీలో చేరారు. వారు టీడీపీలో చేరడం కంటే విజయనగరం రాజులతో కలిసిమెలసి పనిచేయబోవడం అన్నది చర్చనీయాంశంగా మారింది. రెండు రాజవంశాలవారు కలిసి మాట్లాడుకోవడం.... లేదంటే ఒకరి కోటకు ఇంకొకరు వెళ్లడమన్నది ఇంతవరకు చూడలేదని విజయనగరం, బొబ్బిలి ప్రజలు చెబుతున్నారు. రెండున్నర శతాబ్దాల వైరానికి ముగింపు పడడంపై ఉత్తరాంధ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇంత గొప్ప నూతన చరిత్ర ఆవిష్కృతం కావడం వెనుక బొబ్బిలి, విజయనగరం రాజుల పాత్రతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు పాత్ర కూడా మరవలేనిదంటున్నారు.