Begin typing your search above and press return to search.
శశికళకు పోస్టులో వచ్చినవేంటో తెలుసా?
By: Tupaki Desk | 23 March 2017 11:19 AM GMTతమిళనాట రసవత్తర రాజకీయాలకు ఇప్పుడప్పుడే తెర పడేలా లేదు. అన్నాడీఎంకే చీఫ్ గానే కాకుండా... తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత జయలలిత మరణించిన నాటి నుంచి జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తుంటే... ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే... తమిళ ప్రజలంతా అమ్మగా పిలుచుకునే జయ బతికున్నంతకాలం అన్నాడీఎంకే పయనం సాఫీగానే సాగింది. ఓ పర్యాయం అధికార పార్టీగా - మరో పర్యాయం ప్రతిపక్షంగా ఆ పార్టీ తమిళ రాజకీయాల్లో కీలక భూమికే పోషించింది. అయితే జయ మరణంతో అన్నాడీఎంకే ఒక్కసారిగా ఇబ్బందిలో పడిపోయింది. ఈ ఇబ్బంది ఎంతగా ఉందంటే... పార్టీ రెండుగా చీలిపోయేంతగా.
అమ్మ స్థానాన్ని భర్తీ చేస్తానంటూ రంగంలోకి దిగిన జయ నెచ్చెలి శశికళ... సీఎం పీఠం ఎక్కడానికి బదులుగా అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి కూర్చుంది. అయినా కూడా తనకు మాత్రమే నమ్మిన బంటుగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామిని సీఎం పీఠం మీద కూర్చోబెట్టిన శశికళ... ప్రస్తుతం బెంగళూరులో తన నెచ్చెలి జయ కొంతకాలం పాటు కారాగార వాసం గడిపిన పరప్పన అగ్రహార జైలులో విశ్రాంతి తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరం - డీ హైడ్రేషన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన జయ... 72 రోజులుగా మరణంతో పోరాడి ఓడిపోయారు. అయితే జయ మరణానికి గల కారణాలేమీ ఇప్పటిదాకా స్పష్టమైన దాఖలా లేదు. అయితే ఈ విషయంలో జయకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి - లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే చెప్పిన మాటలను ఏ ఒక్క తమిళ తంబీ కూడా నమ్మడం లేదు.
ఈ క్రమంలో అసలు అమ్మ మరణానికి శశికళే కారణమన్న వాదన కూడా తమిళుల్లో క్రమంగా బలపడుతోంది. ఇందుకు నిదర్శనంగానే పరప్పన అగ్రహార జైలులోని శశికళకు పోస్టు ద్వారా కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు వస్తున్నాయి. ఈ ఉత్తరాల్లో జయ మరణానికి కారణం నువ్వేనంటూ తమిళులు ఆగ్రహావేశం వెళ్లగక్కిన విషయాన్ని జైలు అధికారులే స్వయంగా చెబుతున్నారు. ఇప్పటిదాకా శశికళకు వందకు పైగా ఉత్తరాలు వచ్చాయని, వాటిలో శశికళను బండ బూతులు తిడుతూనే... అమ్మ మరణానికి కారణమైన శశికళ సర్వ నాశనం అవుతుందంటూ శాపనార్ధాలు కూడా ఉన్నాయట. ఇక ఆ లేఖల్లోని బూతు బాగోతం వింటే ఆశ్చర్యం వేయక మానదు.
తమిళంలో పచ్చి పచ్చిగా బూతులు వాడుతూ... శశికళకు కాస్తంత ఘాటుగానే హెచ్చరికలు జారీ చేస్తూ తమిళ తంబీలు బూతు పర్వాన్ని లిఖించారట. శశికళ - సెంట్రల్ జైలు - పరప్పన అగ్రహార - బెంగళూరు -560100 చిరుమానాతో వస్తున్న ఆ లేఖలు చదువుతున్న జైలు అధికారులే దిగ్భ్రాంతికి గురవుతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ లేఖల్లోని శాపనార్థాల విషయానికి వస్తే... నీకు విశ్వాసం లేదు, నీకు కృతజ్ఞత లేదు, నువ్వు వెన్నుపోటుదారువి, నీకు జీవితాన్ని, అన్ని ఇచ్చిన అమ్మను మోసం చేశావు, గుర్తుంచుకో నువ్వు చేసిన నీచపు పనులకు అంతకు అంత అనుభవిస్తావు, క్షణక్షణం నరకయాతన అనుభవిస్తావు తమిళ తంబీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఒకటి అరా లేఖలు చదివిన శశికళ... ఆ తర్వాత కొత్తగా వచ్చిన లేఖల గురించి జైలు అధికారులు చెబుతుండగానే జడిసిపోతున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/