Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రి భార్యనే బ్లాక్ మెయిల్ చేశాడు
By: Tupaki Desk | 17 Aug 2016 11:16 AM GMTబ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు సాధారణ ప్రజల నుంచి వీఐపీలు - వీవీఐపీలకు కూడా పాకింది. ఓ ఆగంతకుడు ఏకంగా కేంద్ర మంత్రి ఫ్యామిలీనే టార్గెట్ చేసేశాడు. రెండు కోట్లు ఇస్తావా? చస్తావా? అంటూ ఫోన్ చేసి మరీ బెదిరించాడు. అంతేకాదు, సదరు మంత్రి గారి ఫ్యామిలీ సీక్రెట్స్ అన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తానని కూడా షాకిచ్చాడు. అయితే, ఇవతలి పార్టీ అంత తేలిగ్గా లొంగలేదు లెండి! సైలెంట్ గా ఫోన్ పెట్టేసి.. సదరు బ్లాక్ మెయిలర్ పై పోలీసులకు కంప్లయింట్ చేసేశారు. అసలింతకీ ఏంటో చూద్దాం పదండి! భారత మాజీ సైన్యాధ్యక్షుడు - ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ అందరికీ సుపరిచితులే.
గతంలో సైన్యాధ్యక్ష పదవిలో ఉండగానే ఈయనగారి ఏజ్ మీద పెద్ద రాద్ధాంతమే జరిగింది. అప్పట్లో ఓ విషయంలో ఆయన కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న ఆంటోనీకి నిద్ర పట్టకుండా కూడా చేశారు. అలాంటి వీకే సింగ్ కుటుంబానికి నిద్ర పట్టకుండా చేద్దామని అనుకున్నాడు ఓ బ్లాక్ మెయిర్. సింగ్ గారి భార్య భారతికి ఫోన్ చేసి.. తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను మీ స్నేహితురాలికి బంధువునండీ అంటూ మొదలెట్టి.. తన పేరు ప్రదీప్ చౌహాన్ అని కూడా చెప్పుకున్నాడు. దీంతో భారతి మంచీ చెడ్డా మాట్లాడదామనుకుని ప్రిపేర్ అవుతుంటే.. ప్రదీప్ చౌహాన్ మాత్రం పెద్దబాంబే పేల్చాడు. సింగ్ కుటుంబ రహస్యాలన్నీ తనదగ్గర ఉన్నాయని చెప్పాడు.
ఆ సీక్రెట్ల తాలూకు ఆడియో - వీడియో టేపులు సైతం తన దగ్గర ఉన్నాయని హాట్ పుట్టించాడు. అంతేకాదు, అవన్నీ.. సోషల్ మీడియాలో పెడితే సింగ్ గారి పరువు ఢాం అంటుందని హెచ్చరించాడు. సో.. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే తనకు అర్జంటుగా ఓ రెండు కోట్లు సమర్పించాలని డిమాండ్ చేశాడు. దీంతో భారతీ సింగ్ హడలి పోయి తనకు ఆ రెండు కోట్లు పంపించేస్తుందనుకున్నాడు చౌహాన్. మరి సింగ్ గారి భార్య అంత అమాయకురాలేం కాదు! ఎంతైనా మాజీ సైనాధ్యక్షుడి భార్య కదా.. తెగువ చూపి.. విషయాన్ని సింగ్ గారికి చేరవేసింది.
ఆయన సూచనల మేరకు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక, ఇప్పుడు చౌహాన్ విషయాన్ని పోలీసులు తేల్చే పనిలో పడ్డారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బ్లాక్ మెయిల్ ఫోన్ వెనుక సీక్రెట్లు దాగుండడమే! అన్ని సీక్రెట్టు సింగ్ గారి కుటుంబంలో ఉన్నాయా? అని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, ఇది ఫ్యామిలీ మేటర్ కావడంతో ఏం చేయాలో చర్చిస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో ఇదేమలుపు తిరుగుతుందో చూడాలి.