Begin typing your search above and press return to search.
పేదల ప్లాట్ల కోసం ప్రభుత్వ పెద్దల పాట్లు!
By: Tupaki Desk | 13 Feb 2020 10:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం....ఉగాది నాటికి ఉచితంగా స్థలాలు ఇచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం......రాష్ట్రంలో గూడులేని పేదవాడుండకూడదు....ఇళ్ల స్థలాలపై కొంతకాలంగా సీఎం జగన్ చెబుతోన్న స్టేట్ మెంట్లు ఇవి. స్టేట్‌లో ఈ స్టేట్ మెంట్లు చూసిన పేదలు తమ పాలిట పెన్నిధి జగన్ అని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే, ఇదంతా నాణేనికి ఒక వైపు. పేదల ఇళ్ల స్థలాలు పేరుతో ప్రభుత్వ పెద్దలు భూదందా చేయడానికి సిద్ధమయ్యారన్నది నాణేనికి మరో వైపు. భూ పంపిణీ పేరుతో విశాఖలో ప్రభుత్వ పెద్దలు భారీ భూకుంభకోణానికి తెరతీశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం విశాఖలో భారీగా భూ సమీకరణ జరుగుతోంది. వాస్తవానికి ఆ పంపిణీ కోసం నిర్దేశించిన భూమిని చదును చేసి - రోడ్లు - కాలువలు - విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించి ప్లాట్లు చేయాలి. ఈ తతంగమంతా జరగడానికి ఎకరాకు రూ.52లక్షలు అవుతుందని వీఎంఆర్ డీఏ (విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన సేకరించిన 6 వేల ఎకరాలకు దాదాపు రూ.3 వేల కోట్ల ఖర్చు. అయితే, ఈ ఖర్చు భరించేంత నిధులు తమ దగ్గర లేవని వీఎంఆర్ డీఏ అధికారులు చేతులెత్తేశారు.
ఈ ఖర్చు దగ్గరే ప్రభుత్వ పెద్దల గుట్టు రట్టయింది. ఇవి కమర్షియల్ లేఅవుట్లు కాదని....కాబట్టి నామ్ కా వాస్తే లే అవుట్ వేసి చదును చేసిన భూమికి ట్రెంచులు కొట్టి, మార్కింగ్ వేసి మమా అనిపించాలని పెద్దలు హితబోధ చేశారట. ఈ మాత్రం హింట్ ఇస్తే అల్లుకుపోతా అన్న రీతిలో...ఎకరా ఖర్చును రూ.52 లక్షల నుంచి ఏకంగా రూ.2.5 లక్షలకు తగ్గించారు. ఈ టెక్నిక్ తో తమపై పడ్డ భారాన్ని రూ. 150 కోట్లకు వీఎంఆర్ డీఏ తగ్గించుకుంది. అయితే, అసలా 150 కోట్లయినా...వీఎంఆర్ డీఏ దగ్గరున్నాయా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం జగన్ సర్కార్ సలహాతో వీఎంఆర్ డీఏ అధికారులకు వైఎస్ ఆర్ నాటి ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ గుర్తుకువచ్చాయట.
వైఎస్ హయాంలో బడ్జెట్ సపోర్టు పేరుతో భూములను వీఎంఆర్ డీఏ వేలం వేసింది. ఆ వేలానికి రెస్పాన్స్ రాక ఉడా సొంత సొమ్ము రూ.200 కోట్లు నష్టపోయింది. ఇక, ఈ వేలానికి ఆదాయపుపన్ను కట్టాల్సి రావడంతో వీఎంఆర్ డీఏ మరో 300 కోట్లు నష్టపోయింది. తాజాగా, ఈ ఫ్లాట్లకు లేఅవుట్లు వేసినందుకు వీ ఎంఆర్ డీఏకు 15 శాతం భూమి వస్తుంది. ఆ భూమిని అమ్మి ఆ 150 కోట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆ ఫ్లాట్లకు పెద్ద రేటు రాదని - దాంతో పెట్టిన 150 కోట్లలో ఎంత వస్తుందో చెప్పలేమని అధికారులు మథనపడుతున్నారట. ఇక, పేదలకు ఇచ్చిన చిన్న చిన్న ప్లాట్లను ప్రభుత‌్వ పెద్దలు....పెద్ద ప్లాట్లుగా మార్చి వెంచర్లు వేసుకొని లాభపడబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా పేదలకు భూముల పేరుతో పెద్దలకు మేత వేయడానికి అని విమర్శలు వస్తున్నాయి. ఇక, పాలనలో తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానన్న జగన్.....వీఎంఆర్ డీఏపై భారం మోపడంలోనూ తండ్రి ఆనవాయితీని కొనసాగిస్తున్నారని అధికారులు గుసగుసలాడుకుంటున్నారట.