Begin typing your search above and press return to search.
అగ్నిపర్వతం బద్దలైంది..! శాస్త్రవేత్తలేమో ఆమ్లెట్లు వేసుకు తింటున్నారు..! ఎక్కడంటే?
By: Tupaki Desk | 26 March 2021 1:30 AM GMTఅగ్నిపర్వతం బద్దలు కావడం అనేది ఓ అరుదైన దృశ్యం. అప్పుడు లావా విడుదలవుతుంది.
లావా ఉష్ణోగ్రత 700 నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు వుంటుంది. ఈ లావా చల్లబడి శిలలుగా రూపాంతరం చెందుతుంది.
లావా నీటి కంటే లక్ష రెట్లు చిక్కగా ఉంటుంది. దానికున్న ప్రత్యేక లక్షణాల వల్ల అది చల్లబడి గడ్దకట్టే లోపు చాలా దూరం ప్రవహిస్తుంది. ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్‌ఫాల్ అనే పర్వతం సమీపంలోని ఓ అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. దాదాపు 900 ఏళ్ల తర్వాత ఈ అగ్నిపర్వతం బద్దలైనట్టు సమాచారం.
ఈ అగ్నిపర్వతం బద్దలు కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇదిలా ఉంటే ఈ అగ్నిపర్వతం తదనంతర పరిణామాలు పరిశీలించేందుకు అక్కడికి కొందరు పరిశోధకులు వెళ్లారు. వాళ్లు అక్కడికి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేశారు. వంటలు చేసుకుంటూ, ఆమ్లెట్లు వేసుకుంటూ జాలీగా గడిపారు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. వందల ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెందడంతో కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్ చేరుకున్నారు.
అగ్నిపర్వతం వద్దకు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం ఈ విస్ఫోటనం గురించి అధ్యయనం చేశారు. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు విడుదలైన లావాతో వాళ్లు వంట చేయడం గమనార్హం. 'ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్‌ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది' అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది ఇప్పటికే 58కే వ్యూస్ పొందింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతున్నాయి.