Begin typing your search above and press return to search.
వేధింపులతో వలంటీర్ ఆత్మహత్య
By: Tupaki Desk | 19 Oct 2019 1:49 PM GMTవైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వలంటీర్ల వ్యవస్థలో అపశృతులు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో దారుణం జరిగింది. ఆసిఫ్ నగర్ లో వలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న జుబేదా అనే గ్రామ వలంటీర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
యర్రగొండపాలెం ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వేధింపులు తాళలేక జుబేదా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు...
నిన్న రాత్రి జుబేదా ఇంటికి వెళ్లిన శివ ఆమెతో గొడవ పడ్డాడు. ప్రజల నుంచి డేటా సక్రమంగా సేకరించడం లేదంటూ పరుష పదజాలంతో దూషించినట్టు తెలిసింది.
కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ముందే కంప్యూటర్ ఆపరేటర్ దుర్భాషలాడడంతో మనస్థాపానికి గురైన జుబేదా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.