Begin typing your search above and press return to search.
మృతి చెందిన మహిళకు పింఛన్ ఇచ్చిన వాలంటీర్.. ఎక్కడంటే !
By: Tupaki Desk | 3 March 2021 8:30 AM GMTఓ గ్రామ వాలంటీర్ .. పనిలో నన్ను మించే మొనగాడు లేడు అనుకోవాలి అని అనుకున్నాడో ఏమో కానీ , ఏకంగా చనిపోయిన మహిళ కి కూడా పింఛన్ ఇచ్చాడు. మృతదేహం వద్ద వేలి ముద్రలు తీసుకోని ఆమెకి పింఛన్ అందజేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ అత్యుత్సాహం ప్రదర్శించి ఆమెకి పింఛన్ అందజేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
వివరాల్లోకి వెళ్తే ..విజయనగరం జిల్లా గుర్ల మండలం గుర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇజ్జిరోతు త్రీనాథ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దే వృద్ధులకు పెన్షన్ అందజేస్తుంది ప్రభుత్వం. సోమవారం ఒకటో తేదీ కావడంతో ఆ గ్రామంలో వలంటీర్ గా పని చేస్తున్న ఇజ్జిరోతు త్రినాథ్ పింఛను పంపిణీ చేసేందుకు ఎర్ర నారాయణ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె మరణించగా మృతదేహాన్ని ఇంటి బయట ఉంచి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న త్రినాథ్.. ఎర్ర నారాయణ చనిపోయినప్పటికీ అప్పటికే ఆమెకు పింఛను మంజూరైంది కాబట్టి ఇవ్వడం తన విధి అని ఆమెతో వేలి ముద్ర వేయిస్తే చాలని కుటుంబ సభ్యలతో చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా సరేనని ఆమె వేలిని బయోమెట్రిక్ పరికరంపై ఉంచి వేలి ముద్రలు వేయించారు.ఆమె కుటుంబ సభ్యులకు ఫించన్ డబ్బు పంపిణీ చేశాడు.
ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చనిపోయిన మహిళకు ఎలా పింఛన్ మంజూరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారుల మెప్పు కోసమే వాలంటీర్లు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు స్పందించారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి వేలిముద్రలు పనిచేయవని ఆయన తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.