Begin typing your search above and press return to search.
కరోనా తెచ్చిన బంపర్ ఆఫర్ ..ఆలా చేస్తే రూ.3 లక్షలు మీవే !
By: Tupaki Desk | 11 March 2020 7:02 AM GMTకరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే ప్రపంచంలోని చాలామంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే భారత్ లో కూడా ఈ కరోనా ప్రభావం పెరిగిపోతుంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ , మిగిలిన దేశాలలో వేగంగా విస్తరిస్తుంది. అయితే , ఈ కరోనా కి ఇంతవరకు కూడా ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు.
ఈ నేపథ్యంలో లండన్ లోని క్వీన్ మేరీ బయో ఎంటర్ప్రైజెస్ ఇన్నోవేషన్ సెంటర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఏదైనా కొత్త వాక్సిన్ కనుగొనప్పుడు తొలుత దానిని జంతువులపై ప్రయోగిస్తారు. కానీ, ఇక్కడి శాస్త్రవేత్తలు. ఆరోగ్యవంతమైన వారిని ఎంపిక చేసి వారికి కరోనా వైరస్ ఎక్కించి చికిత్స చేస్తామని చెప్తున్నారు. కరోనా వైరస్ జాతికి చెందిన అదే రకమైన OC43, 229E వైరస్ లను స్వచ్ఛంధంగా వచ్చిన వారికి ఎక్కించనున్నారు.
అలా స్వచ్ఛంధంగా వచ్చి కరోనా వైరస్ ఎక్కించుకున్నవారికి ఒక్కొక్కరికి ఆ సంస్థ ( £3 500 పౌండ్లు) రూ.3లక్షలు చెల్లిస్తామని అంటున్నారు. ఈ ప్రయోగంలో పాల్గొనేందుకు చాలా మంది వాలంటీర్లు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వారిలో ఆరోగ్యవంతులను ఎంపిక చేసి 24 బ్యాచులుగా విభజించి… వారికి కరోనా వైరస్ ను ఎక్కించనున్నారు. ఈ రెండు వైరస్ లు కరోనా జాతికి చెందినవే. కానీ, కరోనా వైరస్ అంత ప్రాణాంతకమైనవి కావు. ఇవి ఎక్కించుకుంటే స్వల స్థాయిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని,..పెద్దగా ప్రాణాపాయం ఉండదంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు. అయితే , మరికొంతమంది మాత్రం మూడు లక్షల కోసం తెలిసి తెలిసి కరోనా వైరస్ ని మనలోకి ఎక్కించుకోవడం అవసరమా అని అంటున్నారు. చూడాలి మరి వారి ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో ..ఒకవేల వారి ప్రయోగం కనుక సక్సెస్ అయితే కరోనా కి వ్యాక్సిన్ దొరికినట్టే.