Begin typing your search above and press return to search.

కరోనా : ప్రతి ఐదుగురు బాధితుల్లో కనిపించిన లక్షణమిదే!

By:  Tupaki Desk   |   6 Nov 2020 12:30 AM GMT
కరోనా : ప్రతి ఐదుగురు బాధితుల్లో  కనిపించిన లక్షణమిదే!
X
దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బంది ఇంతకాలం ఇవే కరోనా లక్షణాలని వైద్యులు చెబుతూ వచ్చారు. అయితే కరోనాకు తాజాగా మరో రెండు కొత్త లక్షణాలు కూడా జత​ అయ్యాయి. అవే వాంతులు, వికారం, గ్యాస్ట్రిక్​సమస్యలు. ప్రతి ఐదుగురిలోనూ ఈ తరహా కొత్త లక్షణాలు బయటపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా రోగులు గ్యాస్ట్రోఇంటెస్టినల్ అనే సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నారు. దీంతో వారికి వికారంగా ఉండటం, వాంతులు, విరేచనాలు వంటివి కనిపిస్తున్నాయి. అబ్డామనినల్ రేడియాలజీ జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. 18శాతం మంది పేషెంట్లలో అలాంటి లక్షణాలే కనిపించాయి. కోవిడ్​ రోగులకు కడుపులో నొప్పి వస్తున్నదని పలువురు రోగుల్లో ఈ లక్షణం బయటపడుతున్నదని కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ క్లినికల్ లెక్చరర్ మిచ్ విల్సన్ పేర్కొన్నారు.

జులై 15నుంచి జరిపిన 36 స్టడీల్లో రీసెర్చర్స్ ఈ విషయాలు కనుగొన్నారు. అటువంటి పరిస్థితుల్లో కొవిడ్19 ఇన్ఫెక్షన్ కనుగొనేందుకు స్కానింగ్ చేయించుకోవాలని చెబుతున్నారు. చిన్న పేగులు, పెద్ద పేగుల్లో మంటలతో పాటు విరేచనాలు కూడా అవుతాయి. కొద్ది మందిలో మాత్రమే ఇవి కనిపిస్తుంటాయి. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కరోనా పేషెంట్లుగా నిర్ధారించలేమని.. దగ్గు, జలుబుతో పాటు కొంతమందిలో ఈ లక్షణాలు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.