Begin typing your search above and press return to search.
వంటేరు దెబ్బకు హరీశ్ విలవిల!
By: Tupaki Desk | 4 Nov 2018 5:44 AM GMTరాజకీయం అన్నాక ప్రత్యర్థి మీద విరుచుకుపడటం కామన్. లేనిపోని విమర్శలు చేయటం ఇప్పుడు రివాజైంది. అర్థం లేని ఆరోపణలు చేయటం మామూలైంది. ఇదే కోవలోకి తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి వ్యాఖ్యల్ని తీసుకోవాలా? శుక్రవారం రాత్రి హరీశ్ తన ప్రైవేటు నెంబర్ నుంచి తనకు ఫోన్ చేశారంటూ సంచలన వ్యాఖ్యల్ని సంధించిన వంటేరును ఎంత వరకు నమ్మొచ్చు. ఆ వ్యాఖ్యల్లో నిజం ఎంత? అన్నది చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
గజ్వేల్‌లో కేసీఆర్ మీద పోటీకి దిగనున్న వంటేరుకు హరీశ్ ఫోన్ చేసే ఛాన్స్ ఉందా? అన్నది మొదటి ప్రశ్న. ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేస్తామన్న వంటేరు మాటల్ని విన్నంతనే నమ్మాలనిపిస్తాయి. కానీ.. లాజిక్ గా చూస్తే.. హరీశ్ క్యారెక్టర్ ను దెబ్బ తీయటమే లక్ష్యమన్నట్లుగా అనిపించక మానదు. ఎక్కడ ప్రమాణం చేయమన్నా వస్తానన్న మాటతో హరీశ్ ను దాదాపు ఫిక్స్ చేసేలా వంటేరు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.
కేసీఆర్‌కు హరీశ్ కు మధ్య పంచాయితీ ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే.. అవెంత తీవ్రంగా ఉన్నాయన్నది చూస్తే.. హరీశ్‌కు కేసీఆర్ మీద కంటే కూడా.. కేసీఆర్‌కు హరీశ్ మీదనే ఎక్కువ అనుమానాలు సందేహాలు ఉన్నాయి. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. వంటేరు చెప్పినంత కాకున్నా.. తన మేనమామ మీద తనకున్న అసంతృప్తిని తనకు అత్యంత ఆప్తుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అంతమాత్రాన మేనమామ అంటే భయం.. భక్తి అన్నదే హరీశ్ కు లేదనుకోవటం తప్పే అవుతుంది.
కొడుకును ఏదేదో చేయాలన్న తాపత్రయంతో అవసరానికి మించిన అతి జాగ్రత్తలు తీసుకోని.. అవసరం లేని ముందుచూపుతో హరీశ్ ను ఇప్పటికే ఎంతగా టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టారు కేసీఆర్. ఆ విషయంలో మరో మాటకు అవకాశం లేదు. అయినప్పటికీ తనను ఈ స్థాయికి తెచ్చిన కేసీఆర్ పట్ల అమితమైన ప్రేమ.. ఆరాధన ఉన్నాయి. అదే సమయంలో ఆగ్రహం ఉంది.
ఉద్యమ వేళలో వెన్నంటే ఉండి.. పార్టీ కోసం నిద్రాహారాలు మాని పని చేస్తే.. కొడుకు వచ్చాడు కదా అని తనను పక్కన పెట్టటం కంటే కూడా.. తన విషయంలో అనుమానాలకు గురి కావటం.. సందేహాల్ని వ్యక్తం చేయటం.. అవమానించేలా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా హరీశ్ ను ఎంతగా హర్ట్ చేయాలో అంతగా హర్ట్ చేశారు కేసీఆర్. ఆ విషయంలో మరో మాటకు అవకాశం లేదు.
తనకు ఇంత నష్టం జరుగుతున్నా.. తనదైన టైం కోసమే హరీశ్ వెయిట్ చేస్తున్నారే తప్పించి.. తన మేనమామను ఓడేలా చేయాలంటూ ప్రైవేటు ఫోన్ నుంచి వంటేరుకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాల్టి రోజున ఎవరూ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ.. హరీశ్ కానీ వంటేరుకు ప్రైవేటు నెంబర్ ద్వారా ఫోన్ చేస్తే.. దాన్ని రికార్డు చేయనంత చిన్న పిల్లాడేమీ కాదు వంటేరు. అలాంటి అవకాశం కోసం ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న వంటేరుకు.. హరీశ్ ప్రైవేటు నెంబరు నుంచి ఫోన్ చేస్తే.. ఈ పాటికి ఆ మాటల ఆడియో క్లిప్ ఇప్పటికే వైరల్ అయ్యేదన్నది మర్చిపోకూడదు.