Begin typing your search above and press return to search.
దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా రాహుల్ తో టచ్ లో హరీశ్
By: Tupaki Desk | 3 Nov 2018 2:14 PM GMTకాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్దికాలంగా సైలెంట్ గా ఉండి క్షేత్రస్థాయిలో తన పని తాను చేసుకుంటూ పోతున్న వంటేరు తాజాగా ఊహించని వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మాజీ మంత్రి హరీష్ రావు... కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి... ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ తో టచ్ లో ఉన్నారని ప్రకటించారు. ఈ కామెంట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి తాజాగా ప్రచారంలో భాగంగా టీఆర్ ఎస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తుందన్న ఆయన... బావబామ్మర్దుల ఆధిపత్యంలో హరీష్ రావు పార్టీ వీడుతున్నారని వెల్లడించారు. హరీష్ రావు మా నాయకుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని తనకు డబ్బులు ఎరగా వేశారని వంటేరు ఆరోపించారు. ఈ విషయాన్ని ఏ దేవుడిపై ప్రమాణం చేసి అయినా తాను ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. ఇక కొంగరకలాన్ సభ తర్వాత 108 సభలు పెడతానన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు... కనిపించకుండా పోయారంటూ వంటేరు ప్రతాప్ రెడ్డి సెటైర్లు వేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత - ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ టీడీపీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... వంటేరుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన గులబీ దళపతికి గట్టిపోటీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది.