Begin typing your search above and press return to search.
రాఘవేంద్రరావుకు చేదు అనుభవం!
By: Tupaki Desk | 7 Dec 2018 5:06 AM GMTఓటు వేయడానికి వచ్చిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద క్యూ ఉండటంతో జనం మధ్య నిలబడకుండా నేరుగా బూత్‌లోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించారు. దీంతో ఆయనను ఓటర్లు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ నగర్ లో ఈ సంఘటన జరిగింది.
పొద్దున్నే వచ్చి మేము క్యూలో నిల్చున్నాం. ఓటరు ఎవరైనా ఒకటే... ఇక్కడ సెలబ్రిటీ అంటూ అందరూ వచ్చి ఓటేసి వెళ్లిపోతే మేము ఎంత సేపు ఇక్కడ నిలడాలి అని పలువురు అరిచారు. పోలీసులు ఆయనను ఆపలేదు. దీంతో ఓటర్లే ఆయనను అరిచి అడ్డుకున్నారు. ఒకరిద్దరు... ఆయన రాఘవేంద్రరావు గారు ఓటేసి వెళ్లిపోతారు... అని బుజ్జగించడానికి ప్రయత్నిస్తే... మేము కూడా ఓటేయడానికి వచ్చాం. ఆయన రాఘవేంద్రరావు అయితే ఏంటి? క్యూలో రావాల్సిందే అంటూ వాదించారు. దీంతో రాఘవేంద్రరావు హర్ట్ అయ్యారు. ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. రద్దీ తగ్గాక వస్తారని ఆయన అనుచరులు చెప్పారు. కానీ ఆయన అలక వీడుతారా లేదా తెలియదు.
గత ఎన్నికల్లో ఇలాంటి సంఘటనే చిరంజీవికి ఎదురు కాగా... ఆయన ఇలా అలగలేదు. ఓటర్లకు సర్దిచెప్పి.. క్యూలో నిల్చుని ఓటేసి వెళ్లారు. ఆర్కే మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తించారు.