Begin typing your search above and press return to search.
పసుపు బాబుకు రాసి కుంకమ బొట్టు జగన్ కు పెట్టారా?
By: Tupaki Desk | 20 May 2019 5:04 AM GMTఏపీ ఎన్నికల్ని పరిశీలిస్తే.. ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. ఏదైనా ప్రభుత్వం విజయవంతమైన కొన్ని సంక్షేమ పథకాలతో కానీ.. అభివృద్ధి నమూనాగా రాష్ట్రాన్ని పరుగులు తీయించటం లాంటి సానుకూల అంశాలతో విజయాన్ని సొంతం చేసుకుంటుందే తప్పించి.. ఒక పథకం మీద ఎక్కువ ఆశలు పెట్టుకొని.. బ్యాంకులో డబ్బులు వేసినంతనే.. ఈవీఎం మీటల్నిఓటర్లు నొక్కేస్తారన్న అంచనాకు రావటం సరికాదు.
కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీ ఓటర్లను చూసిన తీరుకు తగ్గట్లే.. ఓటర్లు ఆయనకు సరైన రీతిలో సమాధానం ఇచ్చారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల బాబు పాలనపై వచ్చినన్ని విమర్శలు.. ఆరోపణలు అన్ని ఇన్ని కావు. పాలనా వైఫల్యాల్ని సరిదిద్దుకునే కన్నా.. షార్ట్ కట్స్ ను ఎంచుకున్న ఆయన.. పోలింగ్ కు కాస్త ముందు ఆడబడుచుల అకౌంట్లలోకి పసుపు కుంకమ డబ్బులు వేస్తే సరిపోతుందన్నట్లుగా భావించటం కనిపిస్తుంది.
టీడీపీ నేతలు పలువురు తమను పసుపు కుంకమ పథకం బయటపడేస్తుందన్న ధీమాను వ్యక్తం చేయటం తెలిసిందే. ఒక్క పథకం.. అది కూడా డబ్బులతో ఓట్లను అధికారికంగా కొనుగోలు చేసేదన్న విమర్శలు మూటకట్టుకున్న దాంతో బాబు ఓటమి నుంచి బయటపడలేరన్న విషయాన్ని తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించిన సంస్థల్లో అత్యధికం వైఎస్సార్ కాంగ్రెస్ కు గెలుపు ఢోకా లేదని తేల్చేసింది.
ఈ సందర్భంగా బాబు నమ్ముకున్న పసుపు కుంకమ పథకం మీద పంచ్ వ్యాఖ్యలు షురూ అయ్యాయి. అలాంటి వాటిల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పంచ్ ఏమంటే.. పసుపుకుంకమ పథకాన్ని బాబు అర్థం చేసుకున్నది ఒకలా ఉంటే.. ఓటర్లు మరోలా అర్థం చేసుకున్నారని.. పథకంలోని పసుపును చంద్రబాబుకు రాసి.. జగన్ కు కుంకమ బొట్టు (విజయ తిలకం) పెట్టారన్న పంచ్ వేస్తున్నారు. తనను ఓటమి కోరల నుంచి ఒడ్డున పడేస్తుందన్న పసుపు కుంకమ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదన్న భావన తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయటం కనిపిస్తుంది.