Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ కు వేయమంటే..కాంగ్రెస్ కు ఓటు..దంచికొట్టారు
By: Tupaki Desk | 7 Dec 2018 10:54 AM GMTపోలింగ్ కేంద్రాల్లో పదనిసలు చోటుచేసుకోవడం - వివాదాస్పద ఘటనలు జరగడం ఎన్నికల సమయంలో సహజమే. అలా జరిగిన ఓ వివాదాస్పద ఘటన మీడియాలో వైరల్ అయింది. టీఆర్ ఎస్ కు వేయమంటే కాంగ్రెస్ కి నొక్కినందుకు పోలింగ్ స్టేషన్ లో చితకబాదారు. నాకు చూపు సరిగ్గా కనబడదు..టీఆర్ ఎస్ కి ఓటు వేయాలని ఆ దివ్యాంగుడు కోరితే...ఆ అధికారి ఏకంగా ‘చేయి’ గుర్తుకు ఓటు వేశాడు....తీవ్ర ఆగ్రహానికి గురైన అక్కడి వారు అతనిపై చేయి చేసుకుని చితకబాదారు. ఈ దృశ్యాలన్నీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
వివరాల్లోకి వెళితే...వెల్గటూరు పోలింగ్ బూత్ లో ఓ దివ్యాంగుడు ఓటు వేసేందుకు వచ్చాడు. కనిచూపు కనిపించదని..తనకు ఓటు వేసేందుకు సహకరించాలని అక్కడున్న పార్టీల ఏజెంట్లను కోరాడు. నిబంధనల దృష్ట్యా ఏజెంట్లు ముందుకు రాకపోవడంతో...అక్కడున్న ఎన్నికల సిబ్బందిలో ఒకరు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. ‘కారు’ గుర్తుకు ఓటేయాలని ఆ దివ్యాంగుడు చెప్పడంతో ఆ అధికారి ఓటు వేసి వచ్చాడు. అనుమానం వచ్చిన ఓ పోలింగ్ ఏజెంట్ వీవీ ప్యాట్ ను గమనించాడు. అందులో కాంగ్రెస్ గుర్తుకు వేసినట్లు పేపర్ ఉండడం..విషయం బయటకు పొక్కింది. ఆగ్రహానికి గురైన వారు ఆ అధికారిని చితకబాదారు. అతడిని నిలదీయడంతో మూడు ఓట్లు మాత్రమే వేశానని అధికారి ఒప్పుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడిలో గాయపడిన అధికారిని ఆసుపత్రికి తరలించారు. పోలింగ్‌ని అధికారులు నిలిపివేశారు.