Begin typing your search above and press return to search.

ఈ ఇంటి ఓట్లు అమ్మ‌బ‌డ‌వు!

By:  Tupaki Desk   |   9 Sep 2018 4:51 AM GMT
ఈ ఇంటి ఓట్లు అమ్మ‌బ‌డ‌వు!
X
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయం వేడెక్కింది. ఊహించ‌ని రీతిలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముచ్చ‌ట‌.. కేసీఆర్ వ్యూహం మీద భారీగా చ‌ర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల ప్ర‌చారం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది.

ఇలాంటి వేళ‌.. జ‌న‌గామ జిల్లా కోమ‌ళ్ల‌కు చెందిన తాళ్ల‌ప‌ల్లి వెంక‌ట‌స్వామి ఇంటి ముందు పెట్టిన బోర్డుఒక‌టి ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

తెలంగాణ‌లోని ఒక మారుమూల ప్రాంతంలోని ఒక వ్య‌క్తి త‌న ఇంటి ముందు పెట్టుకున్న ఈ బోర్డు ఒక ప్ర‌ముఖ ప‌త్రిక‌లో అచ్చు కావ‌టం.. అది కూడా మొద‌టిపేజీలో రావ‌టంతో ఇప్పుడీ బోర్డు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మేకాదు.. హాట్ట ఆపిక్ గా మారింది.

ఇంత‌కీ ఆ బోర్డులో ఏముందంటే.. ఈ ఇంటి ఓట్లు అమ్మ‌బ‌డ‌వు అని తెగేసిన‌ట్లుగా తేల్చేయ‌ట‌మే కాదు.. నా జాతి ప్ర‌జ‌ల‌కు క‌త్తిని చేతికి ఇవ్వ‌లేదు.. ఓటుహ‌క్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులౌతారో.. ఓడిపోయి (అమ్ముడుపోయి) బానిస‌ల‌వుతారో నిర్ణ‌యం మీ చేతిలో ఉంది అన్న అంబేడ్క‌ర్ సూక్తిని రాయించారు. ఆయ‌న ఏర్పాటు చేసిన బోర్డు గ్రామ‌స్తులే కాదు.. ప్ర‌ముఖ ప‌త్రిక‌లో ప్ర‌ధానంగా అచ్చుకావ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కులాలు.. మ‌తాలు.. ప్రాంతాలు. వ‌ర్గాల పేరుతో ఎక్క‌డికక్క‌డ విభ‌జించి పాలించటం ఎలానో నేర్పి పోయిన బ్రిటీషోడి తీరును వంట‌బ‌ట్టించుకొని.. ధ‌న‌బ‌లంతో ఓట్ల‌ను ప్ర‌భావితం చేయాల‌నుకునే నేత‌లు మ‌స్తుగా చుట్టూ ఉన్న వేళ‌.. ఇలాంటి బోర్డులు ప్ర‌తి ఊళ్లో వీలైనంత ఎక్కువ మంది పెట్టుకొని.. త‌మ‌ను ఎవ‌రు పాలించాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకుంటే ఎంత బాగుంటుంది? ఆలోచ‌న బాగానే ఉన్నా.. ఆచ‌రించే వారెంద‌రు అన్న‌దే అస‌లు ప్ర‌శ్న‌.